అఖిల్ అక్కినేని 5వ చిత్రంగా “ఏజెంట్” రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇవ్వనున్నాడు. అఖిల్ లుక్కు సంబంధించి ఓ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో అఖిల్ లుక్ కంప్లీట్‌గా మారిపోయింది. కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న అఖిల్ ఫోటోను రిలీజ్ చేస్తూ ‘ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ’ అంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. ముఖ్యంగా అఖిల్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.
ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నట్లు లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతవరకు ఎప్పుడు చూడనంతగా రఫ్ లుక్‌లో అఖిల్ కనిపించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నాడు.
Shoot Begins!!@AkhilAkkineni8 @AnilSunkara1 @MusicThaman @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl #Agent pic.twitter.com/0hGutnJZ6A
— SurenderReddy (@DirSurender) July 12, 2021