నటి ఆకాంక్ష దూబే తాను చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ వీడియోలో తన చావుకు కారణం ఎవరో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రముఖ భోజ్‌పురీ నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 26న ఆమె ఓ హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్నారు. మొన్నటి వరకు ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? అన్న అనుమానాలు ఉండేవి. పోలీసుల విచారణలో ఆమెది ఆత్మహత్యే అని తేలింది. ఆకాంక్ష తను చనిపోవటానికి ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో కారణంగా పోలీసులు ధ్రువీకరణకు వచ్చారు. ఆ వీడియోలో ఆమె తన చావుకు కారణం ఎవరో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఈ విధంగా ఉంది..
ఆకాంక్ష దూబే బోరున ఏడుస్తూ.. ‘‘ నాకు ఏదైనా అయితే అందుకు సమర్ సింగే కారణం. నా చావు కారణం అతడే’’ అంటూ ఉంది. తన బాధను వీడియోలో చెప్పుకొచ్చింది. కాగా, 25 ఏళ్ల ఆకాంక్ష దూబే ‘‘ముజ్సే షాదీ కరోగి , వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్’’ సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. సమర్ సింగ్ అనే సింగర్‌తో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చటే అయింది. మనస్పర్థల కారణంగా విడిపోయారు. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌తో బాధపడ్డారు. చాన్నాళ్ల బ్రేక్ తర్వాత సినిమాలు చేయటం మొదలుపెట్టారు.
మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయారు. మార్చి నెలలో ఓ సినిమా షూటింగ్ కోసం ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లారు. అక్కడి ఓ హోటల్లో బస చేశారు. మార్చి 26న అనుకోని విధంగా హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో తన చావుకు కారణం తన మాజీ ప్రియుడు సమర్ సింగేనని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, నటి ఆకాంక్ష దూబే చివరి సెల్ఫీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
भोजपुरी एक्ट्रेस आकांक्षा दुबे का एक नया वीडियो आया सामने.इसमे वह रोते हुए अपने साथ कुछ भी गलत होने पर समर सिंह को जिम्मेदार बता रही.#AkanshaDubeySuicide #UPPolice #SamarSingh #Jaunpur #Varanasi #akanshadubey #CMYogi pic.twitter.com/tcP5fzSjqF
— Sri Kant Chaturvedi (@SriChatur007) April 19, 2023