సాధారణంగా సినిమా హీరోయిన్లను దాదాపు సన్నగా నాజూకు లుక్కులో ఎక్కువగా చూస్తుంటాం. కానీ.. అప్పుడప్పుడు కొంతమంది హీరోయిన్స్ వెరైటీ లుక్కులో షాకిస్తుంటారు. ఇంతకుముందు కన్నా బెటర్ గానో.. లేక ఉన్న లుక్ పోయిందనో అనిపించుకుంటారు. అయితే.. రీసెంట్ గా ఫామ్ లో ఉన్న ఓ హీరోయిన్.. కండలు తిరిగిన జబ్బలతో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటీ.. హీరోయిన్స్ మరింత అందంగా.. నాజూకుగా తయారవ్వడం గురించి విన్నాం.. ఈ కండలు తిరిగిన జబ్బలు(షోల్డర్స్) ఏంటని సర్ప్రైజ్ అవ్వకండి. తాజాగా సౌత్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న లుక్కులో కనిపించింది.
కోలీవుడ్ బ్యూటీ అయిన ఐశ్వర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో తమిళ సినిమాలలో నటించి హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఐశ్వర్య.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ డెబ్యూ చేసింది. మొదటి సినిమాతోనే తెలుగులో నేచురల్ బ్యూటీగా ఆడియెన్స్ కి బాగా దగ్గరైన ఐశ్వర్య.. ఆ తర్వాత మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి సినిమాలలో నటించింది. కానీ.. తెలుగులో హీరోయిన్ గా బిగ్ హిట్స్ రాకపోవడంతో మళ్లీ తమిళ, మలయాళం సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో దాదాపు పదికి పైగా తమిళ, మలయాళ సినిమాలున్నాయి. కాగా.. తాజాగా ఐశ్వర్యకి సంబంధించి కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఐశ్వర్య రాజేష్ ఇటీవల సూర్యన్ ఎఫ్ఎం ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో పాల్గొందట. ఈ ఈవెంట్ లో చిన్న పిల్లలతో ముచ్చట పెడుతూ కనిపించింది. అయితే.. ఈ ఈవెంట్ కి ఐశ్వర్య స్లీవ్ లెస్ డ్రెస్ లో హాజరైంది. కాగా.. ఆమె లుక్ పరంగా మరింత స్ట్రాంగ్ గా మారిందని.. ఆమె ఏదో మూవీ లుక్ కోసం కండలు తిరిగిన బాడీ రెడీ చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా ఓవైపు ఐశ్వర్య షోల్డర్స్ పై కామెంట్స్, ట్రోల్స్ వస్తుండగా.. అవేవి పట్టించుకోకుండా సినిమా లుక్ కోసం ఆమె డెడికేషన్ ఎలా ఉందో చూడండి అంటున్నారు ఫ్యాన్స్. ఇండస్ట్రీలో డస్కీ బ్యూటీగా పేరొందిన ఐశ్వర్య.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక తెలుగులో ఎప్పుడు రీఎంట్రీ ఇవ్వనుందో చూడాలి. మరి ఐశ్వర్య లుక్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.