ప్రముఖ సీనియర్ నటులు, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రస్తుతం శోక సంద్రంలో మునిగిపోయింది. తెలుగు నాట ఒక రెబలిజాన్ని సృష్టించిన కృష్ణంరాజు తెలుగు ప్రజలకు ఒక ఇంట్లో మనిషి లాంటి వ్యక్తి. అలాంటి మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. ఆయన మరణానికి గల కారణాలను కృష్ణంరాజుకు చికిత్స అందించిన వైద్యులు వెల్లడించారు. కృష్ణంరాజు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
గతేడాది ఆయన కాలుకి శస్త్రచికిత్స జరిగింది. ఆగస్టు 5న కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలతో హాస్పిటల్లో చేసిన విషయం తెలిసిందే. ఆయన రెండు సార్లు కరోనా బరిన పడ్డారు. అప్పటి నుంచి నెల రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం, డయాబెటిస్, తీవ్రమైన కార్డియాక్ అరెస్టుతోనే కృష్ణంరాజు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా.. కృష్ణంరాజు మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఆరు అడుగుల ఆజానుబాహుడిగా ఉండేవారు కృష్ణం రాజు.. ఇండస్ట్రీలో బాహుబలిలా అనిపిస్తారు. 83 ఏళ్ల వయసులోనూ ఆయనెంతో చలాకీగా, చురుగ్గా కనిపించేవారు. అలాంటి వ్యక్తి ఇలా హఠాత్తుగా మనల్ని వదిలివెళ్లిపోవడం బాధాకరం మంటూ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఏలుతున్నా సమయంలో కృష్ణంరాజు కూడా హీరో రాణించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ కూడా అయ్యారు. ఆయన తర్వాత వారసుడిగా వచ్చిన ప్రభాస్ కూడా కృష్ణంరాజు పేరును నిలబెడుతూ.. పాన్ ఇండియా స్టార్‌గా వెదిగాడు. కృష్ణంరాజు ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, రాజకీయాల్లోనూ సక్సెస్ ఫుల్ అయ్యారు. ఆయన చివరి రోజుల్లోనూ సినిమాల్లో నటించి అభిమానులకు ఆనందాన్ని పంచారు. రాధేశ్యామ్ సినిమాలో ఆయన చేసిన కీలకమైన పాత్రను అద్భుతంగా పండించారు. మరి కృష్ణంరాజు లేని లోటుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కృష్ణం రాజు చివరి కోరిక అదే? తీరకుండానే ఆయన స్వర్గస్తులయ్యారు..
One of the Greatest and Legendary Actor of Telugu Film Industry Krishnam Raju garu is no more. Our deepest condolences to his family members and his beloved fans. Om Shanthi 🙏. pic.twitter.com/BAACnmfM6v
— UV Creations (@UV_Creations) September 11, 2022