తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా చిన్న పాత్రల్లో నటించి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఆయన పునాధిరాళ్లు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, డాన్స్, ఫైట్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఇంతగొప్ప స్థానానికి రావడం సామాన్య విషయం కాదు..ఈ క్రేజ్‌ను సంపాదించుకోవడానికి ఆయన చాలా కష్ట నష్టాలకోర్చారు.
కెరీర్ బిగినింగ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ బహిరంగంగా చెప్పుకోలేదు. కేవలం ఆయన సన్నిహితులకు మాత్రమే చిరు కష్టాలు బాగా తెలుసు. తాజాగా ఓ ఘటనను నటి తులసి బయటపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు నటి తులసి. బాలనటిగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె మెగాస్టార్ ని చూస్తూ పెరిగానని ఆయన గొప్ప నటుడు అంటూ పొగిడింది.
కెరీర్ మొదట్లో ఆయన నటించిన ఓ మూవీ లో తులసి ఓ కీలక పాత్రలో నటించారు. షూటింగ్ కి కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా వచ్చిన చిరంజీవి ఆ రోజు సెట్ లో బయట నిలబడి ఉండటం తాను చూశానని అన్నారు. కారణాలు ఏమైనా రోజంతా ఎండలో నిలబడ్డారు అని చెప్పారు. ఈ మద్య ఆ విషయాన్ని గుర్తు చేసినపుడు తాను ఆ విషయం మర్చిపోయానని చిన్న నవ్వు నవ్వారట. అవమానాలను గుర్తు పెట్టుకోకూడదు అనే తత్వమే ఆయన్ని ఈ రోజు మెగాస్టార్ స్థాయికి తీసుకొచ్చింది. అందుకే ఆయన కోట్ల మంది అభిమానాన్ని పొందారు. మెగాస్టార్ చిరంజీవితో మంత్రి గారి వియ్యంకుడు, మగ మహారాజు వంటి చిత్రాల్లోనూ కలిసి నటించానని తులసి తెలిపారు.