క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఇటీవల సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకుంటుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సురేఖ వాణి ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. పైగా తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుంది. వీలున్నప్పుడల్లా సురేఖ వాణి, సుప్రిత ఇద్దరూ కూడా వెకేషన్స్‌కి వెళుతుంటారు. ఈ ఇద్దరూ ఒక చోట ఉంటేనే నానా హంగామా చేస్తుంటారు.. అలాంటిది ఇక బ్యాంకాక్ లాంటి ప్రదేశాలకు వెళ్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మందు గ్లాసులతో సురేఖ, సుప్రిత! పిక్స్ వైరల్!
అవును వీరిద్దరు ఇంత సడెన్‌గా బ్యాంకాక్ ఎందుకు వెళ్లారు అంటే… నేడు సురేఖ వాణి పుట్టిన రోజు. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం వీరిద్దరు బ్యాంకాక్ చెక్కేశారు. బర్త్‌డే సెలబ్రెషన్స్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఫోటోలు చూస్తే.. అక్కడ వీరిద్దరి ఎంజాయ్‌మెంట్ మాములుగా లేదని అర్థం అవుతుంది. సురేఖ వాణి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. ఎల్లో కలర్ పొట్టి డ్రెస్‌లో చేతిలో వైన్ బాటిల్‌తో.. ఎదురుగా బర్త్‌డే కేక్‌తో సురేఖావాణి.. ఫోజులివ్వగా.. సుప్రిత షేర్ చేసిన వీడియోలో.. తల్లికి దగ్గరుండి మరీ వైన్‌ను తాగిస్తోన్నట్టు కనిపిస్తోంది. బ్యాంకాక్‌లో ఈ తల్లీకూతుళ్లు చేస్తోన్న సందడికి ఇక్కడ నెట్టింట్లో చర్చ బాగానే జరుగుతోంది. సుప్రీత కన్నా సురేఖ వాణే అందంగా ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. మరి సురేఖ వాణి బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సురేఖా వాణి కూతురి లవ్ మ్యాటర్ లో షాకింగ్ ట్విస్ట్!