సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది వారసురాళ్లు కూడా హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో ఒకరు విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. హరోయిన్ గా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది.
ఇటీవల శృతి హాసన్ కెరీర్ లో ఇబ్బందులు వచ్చినా.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన చిన్నప్పటి వీడియో ఒకటి ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. శృతి హాసన్ చిన్నప్పుడే సింగర్ తన ప్రతిభను చాటుకుంది. ఆమె తండ్రితో కలిసి ఓ ప్రోగ్రామ్ లో అద్బుత ప్రదర్శన ఇచ్చింది. శృతి హాసన్ కేవలం నటిగానే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ మంచి డ్యాన్సర్ గా పేరు సంపాదించింది.
తన తండ్రితో తొలిసారి ఒక వేధికపై పాట పాడింది.. ఈ విషయాన్ని శృతి హాసన్ ఓ క్యాప్షన్ లో పేర్కొంది. ‘ఇది ఎంతో గొప్ప మెమొరీ. స్టేజ్ ఎక్కి నేను తొలిసారి పాట పాడాను.. దీని కోసం నేను, డాడీ, మమ్మీ రిహార్సల్స్ చేశాం. ప్రేక్షకుల చప్పట్లు, వారు ఇచ్చే ప్రోత్సాహం ఎంత ఎనర్జీగా ఉంటుందో నాకు ఆ రోజే అర్థమైంది. నా నెక్స్ట్ లైఫ్‌ను ఎలా ఎంచుకోవాలో అర్థమైన క్షణమూ అదే. సింగపూర్ ప్రజలే నా మొట్టమొదటి ప్రేక్షకులు. తొర్రిపళ్లతో నేను పాడగలను అని నాకు అర్థమైంది’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకుంది శృతి.
ఇటీవల రవితేజతో నటించిన క్రాక్ మంచి హిట్ కావడంతో శృతి హాసన్ కి వరుస ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ లో నటిస్తుంది. మరి శృతిహాసన్ చిన్నప్పటి వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.