ప్రియాంక చోప్రా..ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ స్టేటస్‌ని అనుభవిస్తుంది ప్రియాంక చోప్రా. బాలీవుడ్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి, హాలీవుడ్‌కే పరిమితమవుతుంది. అక్కడే నివసిస్తూ అంతర్జాతీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్లైన తర్వాత కూడా ఈ బ్యూటీ తన అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ భామ ప్యారిస్ లోని బల్గెరీ ఈవెంట్‌లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ప్యారీస్ లో ఓ ప్రముఖ జ్యూవెల్లరి సంస్థ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా పాల్గొంది. గోల్డెన్ కలర్ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. హాలీవుడ్ హీరోయిన్లు ధరించే ట్రెండీ వేర్‌ని ప్రియాంక వేసుకుని హాలీవుడ్ పాపులర్ స్టార్స్ అన్నా హత్వే, మరో నటి మోడల్ లీసాతో కలిసి ఆమె చిలిపిగా పోజులివ్వడం విశేషం. ప్రియాంక వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేసి…”మేం ఇలా ఉన్నాం. అమ్మాయిలంతా కలిసి ఇలా ఆనందిస్తున్నాం` అని పేర్కొంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రియాంక ఇచ్చిన ఫోజులు అందరిని ఆకర్షించాయి.
ఇదీ చదవండి: పెళ్ళికి ముందే నయనతారకు కష్టాలు! విగ్నేష్ తల్లి ఆ కండీషన్ పెట్టిందా?
అందం, ఆపై హాట్ పోజులతో ఉన్న తన ఫిక్స్ ను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు కుర్రకారు మతిపొగోట్టేలా చేస్తున్నాయి. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బ్యూటీ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.