కన్నడ బ్యూటి ‘ప్రేమ’ గురించి తెలుగు ప్రేకక్షులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భక్తిపరమైన పాత్రలతో ప్రేమ మంచి గుర్తింపు సంపాదించింది. దేవతలు అంటే ఇలానే ఉంటారేమో అనేలా ఆ పాత్రల్లో ప్రేమ జీవించేది. అలాంటి పాత్రలు ఆమెకు మాత్రమే సాధ్యం. ఇలాంటి క్యారెక్టర్లతో పాటు గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. అప్పట్లో ఆమెకు కుర్రాళ్లలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓ ఇంటర్యూల్లో పాల్గొన్న ఆమె.. తనకు సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. తాను స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సహాయ నటిగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలిపింది. త్రివిక్రమ్ ను నమ్మినందుకు తనను మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘ధర్మచక్రం’ సినిమాతో ప్రేమ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించింది. అలా అతి తక్కువ కాలంలో పలు భాషల్లో నటించింది. అప్పట్లో ఆమె నటించిన దేవి చిత్రం ఓ సంచలనమే అని చెప్పాలి. అంతేకాక అప్పటి కుర్రాళ్లకు ఆమె కలల రాణిగా వెలిగింది. అనేక చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రేమ ఎంతో త్వరగా వెలుగులోకి వచ్చింది. అంతే త్వరగా ఫెడ్ అవుట్ జాబితాలోకి చేరిపోయింది. ఇటీవల మళ్లీ కొన్ని సినిమాలో నటించి..ప్రేక్షకులను పలకరించింది. చాలా కాలం తరువాత బుల్లితెరపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. తాను హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ‘చిరునవ్వుతో’ సినిమాతో సహాయనటిగా ఎందుకు నటించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.
వరుసగా మంచిగా అవకాశాలు అందుకుంటున్న సమయంలో త్రివిక్రమ్ కథను అందిస్తున్న ‘చిరునవ్వుతో’ సినిమాలో అవకాశం వచ్చిందట. ఆ సినిమాలో బావతో పెళ్లి వద్దనుకుని ఓ మోసగాడిని పెళ్లి చేసుకుని మోసపోయిన అమ్మాయి పాత్ర. అయితే ఆ క్యారెక్టర్ చేయడానికి ప్రేమ సంకొచించిందంట.” నేను అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్నాను. మొదట త్రివిక్రమ్ ఈ సినిమాలో నాది హీరోయిన్ పాత్రనని చెప్పారు. కానీ అయితే ఇందులో మరో హీరోయిన్ ఉందా? అని అడిగాను. నీది కూడా హీరోయిన్ రేంజ్ పాత్రే అని చెప్పి తివిక్రమ్ నన్ను ఒప్పించాడు. కథ మొత్తం నా చుట్టూనే ఉంటుందని చెప్పడంతో, త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఆ సినిమా చేశాను. అది రిలీజ్ అయ్యాక నాదంతా సహాయనటి పాత్రగా మారిపోయింది. షూటింగ్ కి ముందు ఒకలా చెప్పి.. సినిమాలో నన్ను ఇంకోలా చిత్రీకరించి త్రివిక్రమ్ మోసం చేశాడు. ఇక ఆ సినిమా తరువాత నాకు అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి. ఆ సినిమా వల్లనే నా కెరీర్ పోయింది” అని తెలిపారు. ప్రస్తుతం ప్రేమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.