తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లకు అమ్మ అనగానే ఆమెనే గుర్తొస్తుంది. ఎందుకంటే అందంలో హీరోయిన్లకు పోటీ ఇస్తూ ఉంటుంది. ఇక ఇన్ స్టాలో ఆమె ఫొటోస్, డ్యాన్స్ వీడియోస్ చూస్తే ఎవరైనా సరే ఆమెకి ఫిదా అవుతారు. కరోనా లాక్ డౌన్ తర్వాత వర్కౌట్ వీడియోస్ తో ఆమె చాలా పాపులర్ అయిపోయింది. అప్పుడప్పుడు టీవీ షోల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ఆమెనే నటి ప్రగతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పలు ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది. హీరోయిన్లకు తల్లిపాత్రలు చేయలేక బాధపడిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఫేమ్ తెచ్చుకున్న నటి ప్రగతి. 1994లో హీరోయిన్ గా పరిచయమైనప్పటికీ, 7 సినిమాల్లో మాత్రమే అలా చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైయింది. అయితే తక్కువ వయసులోనే హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలు చేయడం వేదనకు గురిచేసిందని ప్రగతి వెల్లడించింది. 24 ఏళ్లకే తన వయసు హీరోయిన్లకు ఇలాంటి రోల్స్ చేసి, వాళ్లతో అమ్మ అని పిలిపించుకోవడం చాలా బాధగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చంద్రమోహన్ ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన భార్యని ఆంటీ అని పిలిచేదాన్నని.. కానీ సినిమాల్లో మాత్రం చంద్రమోహన్ కే భార్యగా చేశానని తెలిపింది. ఆ టైంలో చాలాసేపు ఏడ్చానని రివీల్ చేసింది.
షూటింగ్ కోసం జడలు వేసుకుని యంగ్ గెటప్ లో వెళ్తే.. తల్లి పాత్రలు చేసే ఆమె ఏంటి జడలు వేసుకుందని సూటిపోటి మాటలు అనేవారని ప్రగతి చెప్పింది. దీంతో మేకప్ రూంలోకి వెళ్లి గట్టిగా ఏడ్చేదాన్ని అని ప్రగతి పేర్కొంది. ఓ సినిమాలో రైన్ సాంగ్ చేసే విషయంలో కాస్ట్యూమ్స్ ఇబ్బందిగా అనిపించడంతో డైరెక్టర్ కి చెప్పాను. అవే బట్టలు వేసుకోమని చెప్పడంతో పూర్తిగా మూవీస్ కి దూరమై సీరియల్స్ లోకి వచ్చేశానని ప్రగతి చెప్పింది. 2002లో బాబీ మూవీతో నటిగా కెరీర్ రీస్టార్ట్ చేసిన ప్రగతి.. ఇప్పటికే ఫుల్ బిజీగా ఉంటున్నారు. స్టార్ హీరోహీరోయిన్లందరికీ కూడా అమ్మగా చేస్తున్నారు. మరి ప్రగతి ఏడవడం, హీరోయిన్ గా ఛాన్స్ వదులుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.