నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ప్రగతి.. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించింది. ఇప్పటికీ తనకు ఛాలెంజింగ్ అనిపించిన ప్రతి క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు వరుసగా చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన ప్రగతి.. ఈ మధ్యకాలంలో సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో లేదా జిమ్ లో కనిపిస్తోందని అంటున్నారు. కానీ.. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ వస్తున్నాయని.. తాను వరుసగా సినిమాలు చేసేయట్లేదని అంటోంది ప్రగతి.
ఇదిలా ఉండగా.. ఇటీవల నాలుగు పదుల వయసు దాటినా రెండో పెళ్లిళ్లు చేసుకోవడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. సో.. ఇప్పుడిదంతా ట్రెండ్ అయిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి తన లైఫ్, కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. ఎలాగో ప్రగతి సింగిల్ మదర్ కాబట్టి.. రెండో పెళ్లిపై ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా చేసుకోవాలని అనిపించిందా?అని యాంకర్ అడిగింది. దీనిపై ప్రగతి స్పందిస్తూ.. ‘పెళ్లి అనేదానికన్నా కంపానియన్ అంటే బెటర్. చాలాసార్లు నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.’ అని చెప్పింది.
ఇంకా మాట్లాడుతూ.. “కంపానియన్ ఉంటే బాగుంటుందని అనిపించినా.. మళ్లీ నా మెచ్యూరిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా.. అదీగాక సింగిల్ పర్సన్ దొరకడం కష్టం. కానీ.. రావాలని ఉంటే మాత్రం అదే జరుగుతుందని నమ్ముతాను. అయినా నాతో కొంచం కష్టం. ఎందుకంటే..నాకంటూ కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్ గా ఉంటాను. సో.. నాకు ఇలాగే కావాలి, అలాగే ఉండాలి అని. సో.. 20లలో ఉంటే నేను అడ్జెస్ట్ అయ్యేదాన్ని కావచ్చు. ఇప్పుడు కష్టం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రగతి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. మరి రెండో పెళ్లి గురించి ప్రగతి చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.