టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి ప్రగతి. సినిమాల్లో తల్లి, అత్త, అమ్మ, వదిన వంటి పాత్రల్లో నటించి మెప్పించింది. బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది. ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తనకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు షేర్ చేస్తుంది. అలా నటి ప్రగతి.. తన వర్కవుట్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలతో అభిమానులకి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. స్నేహితులరాళ్లతో కలిసి తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రగతి బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.