సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాక ఒక్కొక్కరుగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ వస్తున్నారు. కొందరేమో పెళ్లి పీటలెక్కనున్న వార్తలు చెబుతుంటే.. ఇంకొందరు ప్రేమలో పడ్డామని, ఎంగేజ్మెంట్ అయినట్లుగా చెబుతున్నారు. కానీ.. కొందరు మాత్రం అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలియకుండా ఏకంగా బిడ్డకు జన్మనిచ్చిన వార్తలతో వెలుగులోకి రావడం విశేషం. హైదరాబాద్ కు చెందిన నటి మనాలి రాథోడ్.. తెలుగులో చాలా సినిమాలలో మెరిసింది.
కెరీర్ పరంగా మనాలి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలేవీ చేయలేదు. తమిళంలో అరంగేట్రం చేసిన మనాలి.. తెలుగులో ‘నేను లోకల్’, ‘ఎమ్మెల్యే’, ‘ఫ్యాషన్ డిజైనర్’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘గ్రీన్ సిగ్నల్’ మరియు ‘ఓ స్త్రీ రేపు రా’ వంటి సినిమాలు చేసింది. ఇక 2019లో విజిత్ వర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, బ్యూరోక్రాట్లు.. సన్నిహితులు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఓ విలాసవంతమైన వేదికలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంటకి.. ఇటీవల ఓ పండంటి బిడ్డ జన్మించినట్లు సమాచారం.
ప్రస్తుతం మనాలి బిడ్డను ముద్దాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మనాలి భర్త విజిత్ వర్మ రాజకీయాలలో ఉన్నారట. వీరిది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. కొన్నిరోజుల కిందటే మనాలి బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక వీరికి జూలై 18న ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ వార్త ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం తెలిసినప్పటి నుండి మనాలి జంటకు నెటిజన్స్ కామెంట్స్ లో విష్ చేస్తున్నారు. మరి మనాలి అలియాస్ మంజూల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.