అమ్మ అవ్వడం ఓ అందమైన అనుభూతి. అమ్మతనం కోసం పెళ్లైన ప్రతీ స్త్రీ ఆరాటపడుతుంది. ఇక సెలబ్రిటీల విషయానకి వస్తే పెళ్లి తర్వాత తమ కెరీర్ కు గుడ్ బై చెప్పి కుటుంబానికే తమ టైమ్ ని కేటాయిస్తారు కొందరు. మరి కొంత మంది సెలబ్రిటీలు మాత్రం అటూ ఫ్యామిలీని ఇటూ కెరీర్ ను బ్యాలన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన అమ్మతనం గురించి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మనసులోని భావాలను ఓ కార్యక్రమం ద్వారా వెల్లడించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహిస్తోన్న కార్యక్రమం ”ఫ్రీడమ్ టు ఫీడ్” తాజాగా దీనిలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన అమ్మతనం అనుభూతులను, తన తియ్యని బాధను అభిమానులతో పంచుకుంది. మరిన్ని వివరాల గురించి మాట్లాడుతూ..” కొడుకు నీల్ పుట్టాకే నాకు జీవితం అంటే ఏంటో అర్థం అయ్యింది. కొన్ని సార్లు వాణ్ణి ఇంట్లోనే విడిచి వెళ్లాల్సి వచ్చేది.
అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించేది కానీ ఏంచేయను. ప్రసవం అయ్యాక 40 రోజులు ఇంట్లో నుంచి కదల్లేదు. కొన్ని సార్లు బాబును మా అమ్మ ఒక రూంలో చూసుకుంటే.. మరో రూంలో నేను షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో నా బాబుకు తగినంత టైమ్ కేటాయించ లేక పోతున్నానన్న అపరాధ భావన నన్ను వేధిస్తూ ఉండేది. ఇక నా పిల్లాడికి రొమ్ము పాలు పడుతుంటే ఎంతో సంతోషాన్నినేను పొందుతాను. నాలాగే ప్రతీ తల్లి కూడా ఇదే ఆనందాన్ని పొందుతుంది అని నాకు తెలుసు.
పాలు పట్టే సమయంలో నొప్పిని కూడా తల్లి భరిస్తుంది. అలాంటి నొప్పిని నేను కూడా భరించాను. కానీ తర్వాత కొంత మంది నిపుణుల సూచనలతో దానిని అధిగమించాను. దీంతో ఇప్పుడు నా వెంట ఓ బ్రెస్ట్ పంప్ ను తీసుకెళ్లి సమయానికి నా బిడ్డకు పాలు అందిస్తున్నా” అంటూ ఎంతో విలువైన సలహాలను, తన జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకుంది. మరి కాజల్ తన అమ్మతనం పై పంచుకున్న విశేషాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.