సాధారణంగా డీసెంట్ గా హోమ్లీ రోల్స్ చేసే హీరోయిన్స్ సినిమాలలో సీన్ డిమాండ్ బట్టి కొన్నిసార్లు గ్లామరస్ గా కనిపించాల్సి వస్తుంది. ఎలాంటి సీన్ అయినా చేస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు.. కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి.. అభ్యంతరకరమైన సన్నివేశాలలో కూడా నటించాల్సి వస్తుంటుందని చెబుతుంటారు. అయితే.. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ సన్నివేశం డిమాండ్ బట్టి రొమాన్స్ చేశాం.. హీరోతో సన్నిహితంగా కనిపించే సీన్స్ చేశామని చెప్పడం విన్నాం. కానీ.. ఓ యువ హీరోయిన్ హీరోతో పడకగది సన్నివేశాలలో నటించేందుకు ఏకంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ మాట విన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏ సినిమాలో నటించింది? అనేగా మీ సందేహం.. ఆ యంగ్ హీరోయిన్ పేరు ఇవనా. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. మలయాళంతో పాటు తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల తమిళంలో ‘లవ్ టుడే’ అనే మూవీ చేసింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో.. హీరో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి మంచి కెమిస్ట్రీ పండించింది ఇవనా. అయితే.. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇవనా సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకుంది.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా.. ఈ సినిమాలో హీరోతో కలిసి పడకగది సన్నివేశాలలో నటించారు కదా? సినిమా చూసినవారంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? అని అడగ్గా.. “ఆ రొమాంటిక్ సీన్ గురించి హీరో, డైరెక్టర్ ప్రదీప్ నాకు చెప్పినప్పుడే.. ఆ విషయాన్ని నేను మా పేరెంట్స్ తో చెప్పేశాను. స్టోరీ, సీన్ డిమాండ్ బట్టి.. మా పేరెంట్స్ కూడా ప్రొసీడ్ అవ్వమని చెప్పారు. ఆ బెడ్ సీన్స్ చేయడానికి ముందు భయపడ్డాను. కానీ.. మా పేరెంట్స్ అనుమతి తీసుకున్నాక వెళ్లి ఈజీగా చేసేశాను. డైరెక్టర్ ఆ సీన్స్ ని అశ్లీలత లేకుండా చూపించారు. మూవీ చూశాక నా ఫ్రెండ్స్, పేరెంట్స్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. సో.. ఐయామ్ హ్యాపీ’ అంటూ చెప్పుకొచ్చిందత ఇవనా. ప్రస్తుతం ఇవనా మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.