సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేస్తున్నారు హీరోయిన్స్, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఈ మధ్యే కాస్టింగ్ కౌచ్ విషయాలన్నీ బయటికి రావడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొందరికి కమిట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుందంటూ.. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు హీరోయిన్స్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే.. కాస్టింగ్ కౌచ్ అంశంపై మీటూ ఉద్యమం కూడా నడిచింది. ఈ క్రమంలో ఎందరో హీరోయిన్స్, ఇండస్ట్రీకి చెందిన ఆడవాళ్లు నోరువిప్పి వారి కెరీర్ లో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడారు.
ఇక ఈ కాస్టింగ్ కౌచ్ వలన బాధించబడిన వారిలో తాను కూడా భాగమే అంటోంది బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్. వయసులో తనకంటే పెద్దవాడైన ఓ పాపులర్ నటుడు, నిర్మాత తనను పర్సనల్ గా కలవాలని ఇబ్బంది పెట్టాడని చెప్పి వార్తల్లోకెక్కింది ఇషా. ఇటీవల టాలీవుడ్ యాంకర్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో చర్చలకు దారితీశాయో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇషా సదరు నిర్మాత ఇబ్బంది పెట్టడంతో తన సిబ్బందితో కలిసి అతని దగ్గరికి వెళ్లానని, దీంతో ఆయన మీటింగ్ క్యాన్సల్ చేసినట్లు తెలిపింది.
ఆ సమయంలో అతన్ని ఒంటరిగా కలవకపోవడంతో ఆ నిర్మాత.. మరునాడే తనను సినిమా నుండి తీసేసినట్లు చెబుతూ వాపోయింది. ఆ సంఘటనను గుర్తుచేసుకుని బాధపడిన ఇషా.. ఇండస్ట్రీలో అందంగా ఉండటమే కాదు, హీరోల లిస్టులో చేరడం కూడా ముఖ్యమేనని చెప్పింది. ఆ విషయం పక్కన పెడితే.. కెరీర్ కోసం అలా లొంగిపోయి బతకడం కంటే నిజాయితీగా ఉండటమే గొప్ప విషయమని.. తాను ఇదే పాలసీని నమ్ముతున్నట్లు ఇషా కొప్పికర్ చెప్పుకొచ్చింది. ఇక ఇషా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ లాంటి సినిమాలలో నటించింది. మరి ఇషా గురించి, కాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.