సామాన్యుల ఇంట వివాహ వేడుకలంటే.. సాధారణం. కానీ సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి వార్తలు.. అభిమానులకు ఎంతో ముఖ్యం. తమ అభిమాన తారలకు సంబంధించి ప్రేమ, పెళ్లి విషయాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఇక తాజాగా ఓ హీరోయిన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పిల్ల జమీందార్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో మంచి గుర్తింపు హీరోయిన్ హరిప్రియ. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డట్టప్పటికి.. అవకాశాలు మాత్రం సరిగా రాలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినప్పటికి.. అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఇక తాజాగా హరిప్రియ పెళ్లి పీటలెక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నటి హరిప్రియ, కేజీఎఫ్ ఫేమ్ వశిష్ఠ సింహ.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పి తమ లవ్‌కు ఆమోదం పొందారు. ఈ క్రమంలో పెద్దల అనుమతితో.. ఇద్దరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. కొన్ని రోజుల క్రితమే వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యి.. నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో.. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. వీరి పెళ్లి ఫోటోలు చూసిన నెటిజనులు.. హరిప్రియ, వశిష్ఠ సింహకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక తకిట తకిట సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హరిప్రియ పిల్ల జమీందార్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సరైన అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జైసింహ చిత్రాల్లో నటించింది. ఇక కేజీఎఫ్ సినిమాలోని కమల పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వశిష్ఠ సింహ.. ఆ తర్వాత నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, నయీం డైరీస్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.