సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పటితరం హీరోయిన్లే కాదు.. ఒకప్పటి హీరోయిన్లు కూడా తళుక్కున మెరుస్తున్నారు. శ్రీలీల దగ్గరనుండి రమ్యకృష్ణ వరకు ఏదో రకంగా జనాలని పలకరిస్తూ సందడి చేస్తున్నారు. చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత సీనియర్ హీరోయిన్స్ కెమెరా ముందుకు వచ్చి కనిపించినప్పుడు కొద్దిపాటి ఆశ్చర్యానికి గురి కాక తప్పదు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పటితరం హీరోయిన్లే కాదు.. ఒకప్పటి హీరోయిన్లు కూడా తళుక్కున మెరుస్తున్నారు. శ్రీలీల దగ్గరనుండి రమ్యకృష్ణ వరకు ఏదో రకంగా జనాలని పలకరిస్తూ సందడి చేస్తున్నారు. చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత సీనియర్ హీరోయిన్స్ కెమెరా ముందుకు వచ్చి కనిపించినప్పుడు కొద్దిపాటి ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించిన హీరోయిన్స్.. కొత్తగా షాకింగ్ లుక్ లో కనబడేసరికి ఫ్యాన్స్ కూడా అవాక్కవుతుంటారు . ఈ మధ్య రక్షిత, రాధ లాంటి హీరోయిన్లు బాగా లావుగా కనపడి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయగా.. ఒకప్పటి నటి భువనేశ్వరి.. తాజాగా గుర్తుపట్టలేనంతగా మారి జనాలను సర్ప్రైజ్ చేసింది.
సాధారణంగా హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గితే బోల్డ్ రోల్స్, లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కెరీర్ ఆరంభంలో డీసెంట్ రోల్స్ చేసినప్పటికీ.. బోల్డ్ లోకి దిగాక హాట్ లుక్స్ తో, టైట్ డ్రెస్సులతో, బికినీలలో దర్శనమిచ్చి షాకిస్తుంటారు. కానీ.. నటి భువనేశ్వరి అలా కాదు. ఏకంగా వ్యభిచార గృహాన్ని నడిపిన వార్తల్లో నిలిచింది. ఆఫర్లు రాకపోవడంతో డబ్బు కోసం అప్పట్లో భువనేశ్వరి.. అలాంటి వృత్తిని చేపట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే.. ఈమె వ్యభిచార గృహాన్ని నడిపి పట్టుపడినా.. రాజకీయ అండ ఈమెకు ఎప్పుడూ ఉండేదని.. ఎన్నిసార్లు పోలీసులకి దొరికినా రాజకీయ నాయకుల అండతో పెద్దగా కష్టపడకుండానే బయటికి వచ్చేదని అంటుంటారు.
కెరీర్ ప్రారంభంలో డబ్బింగ్ సీరియల్స్ తో అలరించిన భువనేశ్వరి.. క్రమంగా సినిమాల్లో కూడా అవకాశాలు చేజిక్కించుకుంది. సినిమాల్లో కూడా చాలా వరకు హాట్ సీన్లు, వేశ్య పాత్రలు చేసి పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ సీనియర్ నటి ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త లుక్ లో కనిపించి జనాలకు సర్ప్రైజ్ చేసింది. ఈసారి హాట్ లుక్కులో కాకుండా చాలా సాంప్రదాయంగా చీరలో బాగా లావు పెరిగి నమ్మశక్యం కానీ రీతిలో దర్శనమిచ్చింది. తిరుమల వారి సన్నిధిలో దర్శనం చేసుకున్న భువనేశ్వరి ఫోటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఒకప్పుడు తన అందంతో అందర్నీ ఆకట్టుకున్న భువనేశ్వరి.. ఇప్పుడు బొద్దుగా మారిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపండి.