ఐశ్వర్య రాజేష్.. టాలీవుడ్ ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ కోలీవుడ్ భామ. అలానే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఐశ్యర్య నేచురల్ బ్యూటీగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి సినిమాలలో నటించింది. కానీ.. తెలుగులో హీరోయిన్ గా బిగ్ హిట్స్ రాకపోవడంతో మళ్లీ తమిళ, మలయాళం సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో దాదాపు పదికి పైగా తమిళ, మలయాళ సినిమాలున్నాయి. తాజాగా ఆమె డ్రైవర్ జమున అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మహిళ ఆటో డ్రైవర్లను కలిశారు. ఈ క్రమంలో వారిలోని ఓ ఆటో డ్రైవర్ కు ఐశ్వర్య సర్ ఫ్రైజ్ ఇచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఐశ్వర్య రాజేష్ నేచురల్ బ్యూటిగా పేరు సంపాదించింది. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎక్కువగా చేసింది. అందుకే ఆమె లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలలో హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె డ్రైవర్ జమున అనే లేడీ ఓరియంటేడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను 18 ప్రిన్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించగా, కింగ్స్ లిన్ దర్శకత్వం వహించారు. ఇందులో మహిళ డ్రైవర్ గా బలమైన పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా.. ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి ఐశ్వర్య హాజరయ్యారు. అంతేకాక తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి 40 మందిపైగా మహిళ ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో ముచ్చటించి.. అనేక విషయాలు తెలుసుకున్నారు.
అలానే ఐశ్వర్య రాజేష్ తో మహిళ ఆటో డ్రైవర్లు.. తమ అనుభవానలు పంచుకున్నారు. వారు జీవితంలో పడిన కష్టాలను ఐశ్వర్య అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఆ 40 మంది ఆటో డ్రైవర్లలో నుంచి ఓ మహిళను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది. ఆమె స్టేజి పైకి ఆహ్వానించారు. ఐశ్వర్య రాజేష్.. ఆ మహిళ డ్రైవర్ కి ఆటోను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చింది. చిత్ర యూనిట్ ఇచ్చిన ఈ సండెన్ సర్ ప్రైజ్ కు సదరు మహిళ ఆటో డ్రైవర్ కొద్ది సేపు షాకయ్యారు. ఆ ఆటోకు సంబంధించి తాళం చెవిని ఆ మహిళ డ్రైవర్ కు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ అందజేశారు. దీంతో డ్రైవర్ జమున చిత్ర యూనిట్ ను సోషల్ మీడియా ద్వారా పలువురు అభినందించారు. మరీ.. ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ పనికిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.