ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలు, సీరియల్స్ లో నటించే హీరోహీరోయిన్స్, సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్స్ ఇలా అందరూ ముందుగా గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే.. ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలైతే ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు. కానీ.. తమ అభిమాన హీరో, హీరోయిన్లు పండంటి బిడ్డకు జన్మనిచ్చి పేరెంట్స్ అయ్యారంటే మాత్రం వెంటనే శుభాకాంక్షలు చెబుతుంటారు.
ప్రస్తుతం రామాయణం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ దెబీనా బొనర్జికి సోషల్ మీడియాలో అలాంటి విషెష్ చెబుతున్నారు ఫ్యాన్స్. రామాయణం సీరియల్ లో సీతగా నటించిన దెబీనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో ‘అమ్మాయిలు అబ్బాయిలు’ అనే మూవీతో హీరోయిన్ గా డెబ్యూ కూడా చేసింది. కానీ.. అప్పటికే రామాయణం సీరియల్ తో పాటు పలు హిందీ సీరియల్స్ కమిట్ అవ్వడంతో దెబీనా తెలుగులో సినిమాలు చేయలేకపోయింది. అయితే.. దెబీనా తనతో పాటు రామాయణం సీరియల్ లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరినే పెళ్లి చేసుకోవడం విశేషం.
రీల్ లైఫ్ లో రాముడు – సీతగా నటించి.. రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గుర్మీత్ – దెబీనా. మొదట 2011లో పెళ్లి చేసుకున్న దెబీనా – గుర్మీత్.. 2021లో రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత 2022 ఏప్రిల్ లో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖులంతా సంతోషించారు. కానీ.. మొదటి బిడ్డ పుట్టిన ఏడు నెలల్లోనే రెండో బిడ్డకు జన్మనివ్వడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవును.. దెబీనా, గుర్మీత్ ఈ ఏడాది నవంబర్ 11న రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.
అందుకు సంబంధించి ఈ దంపతులు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. తాము రెండోసారి పేరెంట్స్ అయినందుకు ఆనందంగా ఉందని.. రెండో కుమార్తెకి సంబంధించి ఫోటోలు, వివరాలు సీక్రెట్ గా ఉంచుతాం అని ఇన్ స్టాగ్రామ్ పోస్టులో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. దెబీనా తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది. అయితే.. సినిమాలలో కంటే సీరియల్స్ ద్వారా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. గుర్మీత్ కూడా అంతే. వీరిద్దరూ కలిసి చాలా సీరియల్స్ లో నటించారు. బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూసులు చెప్పేసరికి ఓవైపు షాకింగ్ గానూ, మరోవైపు హ్యాపీగానూ ఫీల్ అవుతున్నారు అభిమానులు, నెటిజన్స్.