కళ్యాణ్ రామ్ తో కలిసి నటించిన నటుడు, సంగీత దర్శకుడు తన భార్యకు విడాకులు ఇచ్చారు. 10 మంది మహిళలతో శారీరక సంబంధం పెట్టుకున్న ఆ నటుడు.. తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకే ఎవరా నటుడు?
చిత్ర పరిశ్రమలో ప్రేమ, బ్రేకప్, పెళ్లి, డైవర్స్ అనేవి సర్వ సాధారణమైపోయాయి. రిలేషన్ లో ఉన్నన్ని రోజులు కూడా పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండడం లేదు. మన టాలీవుడ్ దాటితే మిగతా ఇండస్ట్రీలో ఈ రిలేషన్ షిప్ లు, బ్రేకప్ లు, డైవర్స్ లు ఎక్కువగా ఉంటాయి. బాలీవుడ్ లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ బ్రేకప్ లిస్టులు, డైవర్స్ లిస్టుల్లో చేరే సభ్యుల సంఖ్య ఎక్కువ. తాజాగా ఈ జాబితాలోకి ఎన్టీఆర్ తో శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో నటించిన నటుడు, హీరో విద్యుత్ జమ్వాల్, ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీ ఉన్నారు. వీరిద్దరూ కూడా సామాజిక దూరం పాటిస్తున్నారు. తాజాగా మరొక నటుడు తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ప్రముఖ మలయాళీ నటుడు, సంగీత దర్శకుడు అయిన వినాయకన్ తన భార్యకు విడాకులు ఇచ్చారు. మలయాళం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా విలన్ వేషాలు వేస్తుంటారు. తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడు సినిమాలో రెండో విలన్ గా నటించారు. బబిత అనే బ్యాంకు ఉద్యోగిని వివాహం చేసుకున్న వినాయకన్.. ఆమెతో వివాహ బంధం ముగిసిందని వెల్లడించారు. గత ఏడాది 10 మంది మహిళలతో సంబంధం ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మీటూ ఉద్యమం అంటే ఏంటో తనకు తెలియదని, ‘నాతో శృంగారం చేస్తావా’ అని మహిళను అడగడమే మీటూ అయితే, దాన్ని తాను కొనసాగిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తనకు ఇప్పటి వరకూ 10 మంది మహిళలతో శారీరక సంబంధం ఉంది అంటూ అప్పట్లో సంచలన కామెంట్స్ చేశారు. అది కాస్తా వివాదానికి దారి తీయడంతో క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు భార్యతో విడాకుల వ్యవహారంతో మరోసారి వార్తల్లో నిలిచారు. బహుశా ఏడాది క్రితం మహిళలతో సంబంధం ఉంది అని చెప్పడమే ఈ డైవర్స్ కి కారణమై ఉండవచ్చునని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహిళలతో సంబంధం విషయంలో ఆయన భార్యకు, ఆయనకు మధ్య గొడవ జరిగి ఉండవచ్చునని, అందుకే విడాకులు ఇచ్చి ఉంటారేమో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఓ ప్రముఖ నటితో ఎఫైర్ కొనసాగిస్తున్నారని.. ఈ విషయంలోనే భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.