Actor Sriram: తెలుగు ప్రేక్షకులకు నటుడు శ్రీరామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి శ్రీకాంత్ గా ఎంటర్ అయినప్పటికీ, తెలుగులో శ్రీరామ్ గానే పాపులర్ అయ్యాడు. మొదట హీరోగా సినిమాలు చేసిన శ్రీరామ్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, స్నేహితుడు లాంటి చిత్రాలు శ్రీరామ్ కి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఇక కొన్నేళ్లుగా హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ రాణిస్తున్నాడు శ్రీరామ్. తాజాగా ’10క్లాస్ డైరీస్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జూలై 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో ఆ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ఇటీవలే ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.
ఈ క్రమంలో శ్రీరామ్ ఎంతో ఉత్సాహంగా కనిపించి.. చివరిలో అందరినీ ఎమోషనల్ చేశాడు. తన కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకున్న శ్రీరామ్.. హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల తాను వెనకబడ్డానని తెలిపాడు. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో తన ముఖంతో పాటు పెదాలు, ముక్కు, కాళ్ళు చేతులు, జుట్టు ఇలా మొత్తం కాలిపోయానని, ఆ టైంలో నరకం అనుభవించానని చెబుతూ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నటుడు శ్రీకాంత్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.