ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా మాట బాగా వినిపిస్తోంది. ఇక పాన్ ఇండియా పదంతో అటు నార్త్.. ఇటు సౌత్ హీరోలకు మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సౌత్‌లో విడుదలైన పుష్ప, RRR, KGF చిత్రాలు ఇటు సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా దుమ్ముదులుపుతున్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమాల క్రేజ్ చేసి బాలీవుడ్ ఈర్షతో రగిలిపోతుంది. కొందరు హీరోలయితే బహిరంగంగానే సౌత్ సినిమాలపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై స్పందించారు హీరో సిద్ధార్థ్.
ఇది కూడా చదవండి: Sai Pallavi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న సాయి పల్లవి.. అందుకే సినిమాలు తగ్గించిందా!
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే సిద్ధార్థ్.. పాన్ ఇండియా వివాదంపై అదే రేంజ్‌లో స్పందించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చేసేవి అన్ని భారతీయ సినిమాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారు. పాన్ ఇండియా సినిమా అనే పదమే ఒక నాన్సెన్స్.. అగౌరవం. కొన్ని సంవత్సరాల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా వచ్చింది కదా. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దేశం మొత్తం ప్రతి ఒక్కరూ చూశారు. గతంలోనే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. సినిమాను నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంది. అందుకే పాన్ ఇండియా అనే పదం తీసేసి ఇండియన్ సినిమా అని పెట్టండి’’ అన్నాడు.
ఇది కూడా చదవండి: Blackmail: CM పేరు చెప్పి MLAలను బ్లాక్‌మెయిల్.. ఆ డబ్బుతో గర్ల్‌ఫ్రెండ్‌కి లక్షల ఖరీదైన గిఫ్ట్!అంతేకాక ‘‘ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషయన్లు కష్టపడతారు. వారికి భాషా భేదం ఉండదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా, ఏ భాషలో అయినా కచ్చితంగా హిట్ అవుతుంది. దానికి పాన్ ఇండియా సినిమా అని బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు” అంటూ స్పందించాడు. దీంతో సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సిద్ధార్థ్ వ్యాఖ్యలతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరి సిద్ధార్థ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయకూడదు అనుకుంటున్నాను: బండ్ల గణేష్