ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెలబ్రెటీలు.. వారి బంధులువు కన్నుమూస్తున్నారు. తాజాగా నటుడు మహర్షి ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు రాఘవ సినీ,టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ఇక రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.
వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో హీరోగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు రాఘవ. పలు చిత్రాల్లో నటించిన ఆయన తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు అంత్యక్రియలు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. కమలమ్మ సినీ, టీవీ కళాకారులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.