సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల మధ్య వార్ జరుగుతుంటుంది. సినిమాల మధ్యే కాదు.. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు వెనుకాముందు అయినప్పటికీ, కోలీవుడ్ లో తల అజిత్.. వలిమై సినిమాతో ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనింగ్స్ రికార్డు క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది అంటే.. 2023 సంక్రాంతి కోసం తెలుగుతో పాటు కోలీవుడ్ లో స్టార్స్ సినిమాల మధ్య వార్ గట్టిగానే జరుగబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగులో ఆల్రెడీ మూడు, నాలుగు సినిమాలు పొంగల్ రిలీజ్ కి డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి.
ఈ క్రమంలో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య రసవత్తరమైన పోటీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్స్ తల అజిత్ వర్సెస్ దళపతి విజయ్ సినిమాల మధ్య రానున్న సంక్రాంతికి ఫైట్ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు చేస్తున్న సినిమాలు 2023 సంక్రాంతికి రిలీజ్ అని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి వలిమైతో హిట్ కొట్టిన అజిత్.. అదే డైరెక్టర్ తో ‘తునివు’ మూవీ చేస్తున్నాడు. అలాగే ఈ ఏడాది బీస్ట్ తో ప్రేక్షకులను పలకరించిన విజయ్.. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ మూవీ చేస్తున్నాడు.
ఇక విజయ్ నటిస్తున్న వారిసు మూవీ.. 2023 సంక్రాంతికి రిలీజ్ అని ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మరోవైపు అజిత్ నటిస్తున్న తునివు చిత్రం కూడా సంక్రాంతి రిలీజ్ ఫైనల్ అయ్యిందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ కాబోతున్నాయి. అయితే.. అజిత్, విజయ్ ల మధ్య పోటీ అనేసరికి కోలీవుడ్ లో వాతావరణం హీటెక్కింది. ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య రెగ్యులర్ గా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటివరకూ చాలా సందర్భాలలో విజయ్, అజిత్ ఫ్యాన్స్ తలపడటం చూశాం. ఈసారి మాత్రం బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత తీవ్రంగా ఉండబోతుందని టాక్ నడుస్తుంది.
ఇదిలా ఉండగా.. అజిత్, విజయ్ సినిమాలు పోటీ పడటం అనేది కొత్త కాదు. తొమ్మిదేళ్ల క్రితమే విజయ్ జిల్లా.. అజిత్ వీరమ్ సినిమాలు సంక్రాంతికి విడుదలై మంచి విజయాలు నమోదు చేశాయి. ప్రస్తుతం ట్విట్టర్ లో అటు అజిత్, ఇటు విజయ్ ఫ్యాన్స్ మధ్య భారీ వార్ జరుగుతోంది. పొంగల్ రిలీజ్ అంటూ తునివు, వారిసు టైటిల్స్ ట్రెండ్ చేస్తుండటం విశేషం. మరి వచ్చే సంక్రాంతికి కూడా రెండు సినిమాలు హిట్ అవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ.. హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ ఎలా ఉంటుందోనని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక వారిసులో విజయ్ సరసన రష్మిక మందాన హీరోయిన్ కాగా.. తునివులో అజిత్ సరసన మంజు వారియర్ నటిస్తోంది. చూడాలి మరి ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య వార్.. తొమ్మిదేళ్ల తర్వాత ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందో!
Pongal 2023 is going to be LIT with two biggest stars Ajith and Vijay releasing their films. Maximum celebrations are in store for #Thunivu and #Varisu. Ready? 💥🔥🥵 pic.twitter.com/PEE1SMHBkq
— LetsCinema (@letscinema) October 28, 2022
#VarisuPongal 🔥🔊 @actorvijay Anna 🎹🤩 pic.twitter.com/CEOwhScr16
— thaman S (@MusicThaman) October 24, 2022
This Pongal with #Thala #AjithKumar #Thunivu pic.twitter.com/lGMJGFJ67o
— Chirag jani (@JaniChiragjani) October 28, 2022
Again after 2014 a Pongal to remember forever 🤜🤛. #Thunivu & #Varisu .#ThunivuPongal #VarisuPongal pic.twitter.com/LDgbvbD7tj
— Anand Cinemas (@AnandCinemas) October 28, 2022