వివాహం బంధం అన్నది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ఏళ్ల నుంచి ఆచరణలో ఉంది. వివాహం బంధంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికి కొన్ని మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఆడ కావచ్చు.. మగ కావచ్చు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఇద్దరిలో ఎవ్వరు అందుకోలేకపోయినా అవతలి వ్యక్తికి అది ఇబ్బందిగా మారుతుంది. అన్ని విషయాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి సమయంలో భార్యాభర్తలు ఏం చేయాలో రమా రావి వివరించి చెప్పారు. రమా రావి మాట్లాడుతూ.. ‘‘వివాహ వ్యవస్థ ఈనాటిది కాదు. ఆడవాళ్లకు రక్షణ, భద్రత.. మగాళ్లకు ఆసరా ఇది సాధారణమైంది.
వీళ్లిద్దరూ కలిసి సంసార రథాన్ని ముందుకు తీసుకెళతారు. సంతానాన్ని కంటారు. పెళ్లిలో ఒకళ్ల మీద ఒకళ్లకు ఎక్స్‌పెక్టేషన్స్ కచ్చితంగా ఉంటాయి. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఏ ఇద్దరూ కలిసి ఉండరు. భార్యాభర్తలంటే ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు కుటుంబాలు.. వీళ్లిద్దరూ కలిపి ఓ కుటుంబం. భార్యాభర్తల్లో ఎవరికి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా ఇబ్బందే. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోతే కలిసి ఉండటంలో అర్థం లేదు. మితిమీరిన ఎక్స్‌పెక్టేషన్స్ లేదా.. సాధారణ ఎక్స్‌పెక్టేషన్స్‌ను తీర్చలేని తనం కానీ, రెండూ కష్టమే. భార్యకు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే ఇబ్బందే.
భార్యను సరిగా చూసుకోవటం చేతకాని వాడు ఎందుకూ పనికి రాని వాడు అన్నాడు చాణిక్యుడు. భర్త భార్యతో ముద్దు మురిపిం చూపించాలి. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి. అవి కూడా చేయని వాళ్లు చాలా మందే ఉన్నారు. భార్య అన్ని పనుల్లో సాయం చేసే వాళ్లు ఉన్నట్లే.. ఆడవాళ్లను ఏమీ పట్టించుకోకుండా దారుణంగా చూసే వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు మారాలి. ఆడాళ్లు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ మానుకోవాలి. మగాళ్లకు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన భర్తకు టీ, కాఫీలు ఇవ్వటం.. వేళకు అన్నం పెట్టాలి.
వాళ్ల అమ్మానాన్నను బాగా చూసుకోవాలి. తనతో బాగా ఉండాలి. ఈయన ప్రేమగా ఉంటాడు. ఆమె మాత్రం ఎందుకు? ఏమిటి? పిచ్చి వేషాలు అంటుంది. ఈయన రొమాంటిక్‌గా ఉండే ధోరణి.. ఆవిడ అంత రొమాంటిక్ కాదు.. భర్త మాత్రం రొమాంటిక్‌గా ఉండాలని కోరుకుంటాడు. ఇంకొంత మంది తమ పర్మిషన్ లేనిదే భార్య గాలి కూడా పీల్చకూడదని అనుకుంటూ ఉంటారు. ఈ రెండూ తప్పే.. నేనే క్వీన్‌గా ఉండాలని ఆవిడా అనుకోకూడదు.. నేనే కింగ్ అని ఆయన అనుకోకూడదు. ఇలాంటి సమయంలో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. మాట్లాడినా వినకపోతే.. మన ఎక్స్‌పెక్టేషన్స్‌ను తగ్గించుకోవాలి’’ అని అన్నారు.