సూపర్ మార్కెట్.. సూపర్ మార్కెట్ నువ్వు ఏం చేస్తావు అంటే.. వెయ్యి రూపాయల సరుకులు కొనాలని వచ్చిన వారితో కనీసం 10 వేల రూపాయల సరుకులు కొనిపిస్తా అన్నదట. సూపర్ మార్కెట్ల జోరు, సాధారణ పౌరుల పోరు చూస్తుంటే పరిస్థితి ఇలానే ఉందనిపిస్తుంది. అనిపించడం ఏమిటి పిండా మీల్.. అదే నిజం. రైలుపెట్టెలు అమ్మడం లేదు గానీ అమ్మితే గనుక.. అగ్గిపెట్టె కొందామని వెళ్లే వారి ఆలోచన సైతం మార్చేసి వారితో రైలుపెట్టె కొనేలా చేస్తారు. అదే సూపర్ మార్టులు, మార్కెట్ల వెనుక ఉన్న స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అర్ధం కావాలంటే మళ్ళీ పెద్ద పెద్ద చదువులు, పుస్తకాలూ చదవక్కర్లేదు. జస్ట్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సరిపోతుంది.
కావాల్సినవి మాత్రమే కొనుక్కుని వచ్చేసేవాళ్లు హీరోలు, కావాల్సిన వాటితో పాటు అక్కర్లేనివి కూడా కొనుక్కునేవాళ్ళు కమెడియన్లు అని ప్రతి ఒక్కరికీ అనుభవం అయ్యే ఉంటుంది. అతిగా షాపింగ్ చేసే ఆమె, అస్సలు ఆలోచించని అతడు బాగుపడినట్టు షాపింగ్ చరిత్రలోనే లేదు. ఒకటి కొందామని వెళ్తే.. మరొకటి తగులుకుంటుంది. అయ్యో వారు మాత్రం బతకొద్దేమిటండి అని సానుభూతి చూపిస్తే సామాన్య జనం మన మీద మనమే సానుభూతి చూపించుకునే పరిస్థితి వస్తుంది. ఇది యాపారం.. మా స్ట్రాటజీలు, ఆఫర్లు ఇలానే ఉంటాయి అని వారు చెప్పకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక సామాన్యుడిగా అందరి బాధ్యత. ఎందుకంటే నలిగిపోతున్న జీవితాల గురించి సామాన్యుడి కంటే బాగా ఇంకెవరికీ తెలియదు కాబట్టి.
ఒకప్పుడు ఏమైనా సరుకులు కొనాలంటే ఇంటి దగ్గర్లోనే ఉన్న దుకాణాలకు వెళ్లి తెచ్చుకునేవారు. ఇప్పుడు 10 రూపాయలు తగ్గుతుందంటే 200 ఖర్చు పెట్టైనా సరే ఎక్కడో దూరంగా ఉన్న మార్టుకి వెళ్లి 2వేలు వదలగొట్టుకుని వస్తాం. ఏ, బీ, సీ, డీ ల పేరుతో అనేక సూపర్ మార్టులొచ్చేశాయి. అవి సూపర్ గానే ఉంటాయి. కొన్న సామాన్యులకు ఊఫర్ అదిరిపోతోంది. ఏం కావాలన్నా ఒకే చోట దొరుకుతున్నాయి. దీంతో రకరకాల ప్రదేశాలకి తిరిగే పని లేదు. కస్టమర్ల పని సులువైయిపోయింది. అదే సమయంలో మార్టుల యజమానుల పని కూడా సులువైపోయింది. కస్టమర్ల చేత అక్కర్లేని సరుకులు కొనిపించడం కూడా మార్టు యజమానుల సులువైన పని. కాబట్టి ఈ మార్టుల ట్రాప్ లో పడకుండా.. ఖర్చు తగ్గించుకోండిలా.
ఖర్చుల విషయంలో బడ్జెట్ పద్మనాభంలా ఉంటేనే సిటీల్లో సొంత ఇల్లు కట్టుకోగలరు. లేదంటే ఈ జీవితం సూపర్ మార్కెట్లని.. ఏ, బీ, సీ, డీ మార్ట్ లని పోషించడానికే సరిపోతుంది. కాబట్టి ఫుల్ ఫోకస్ లో ఉండండి. మీరు వచ్చిన పని ఏంటో క్లారిటీగా చూసుకుని వెళ్ళండి. మార్ట్ వాళ్ళు ఆకర్షణీయమైన వస్తువులతో డిస్ట్రాక్ట్ చేస్తుంటారు. అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకండి. డబ్బు ఆదా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగిపోండి. దాని కోసం ఈ చిట్కాలను పాటించండి.