శృంగారం.. చాలామంది అదేదో బూతు పదంగా భావిస్తూ ఉంటారు. నిజానికి అందరూ తమ జీవితంలో తప్పక తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అది. కానీ, మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మన కట్టుబాట్లు, సంప్రదాయాలు కావచ్చు ఆ అంశాన్ని దగ్గరకు రానివ్వకుండా దూరం పెడుతూ వచ్చారు. సినిమాల్లో చూసి శృంగారం అనగానే పువ్వులు కదపడం, పాలు తాగి, లైట్ ఆపేసి నిద్రపోవడం అనుకునే వాళ్లు కూడా లేకపోలేదు. శృంగారం అనేది జీవితంలో ఒక భాగమనేది చాలా మంది భావించడం లేదు. శృంగారం అంటే కేవలం సంతానాభివృద్ధి కోసం మాత్రమే కాదు.. దానివల్ల ఆరోగ్య లాభాలు కూడా చాలానే ఉన్నాయి. ఎక్కువగా భాగస్వామితో శృంగారంలో పాల్గొనే వారికి గుండె జబ్బులు దరిచేరవు.
అంతేకాకుండా.. రాత్రి శృంగారంలో పాల్గొనడం వల్ల బాగా నిద్రపోగలుగుతారు, ఉదయాన్నే ఎంతో హుషారుగా మీ రోజుని ప్రారంభిస్తారు. అదే రాత్రి కార్యం జరగకపోతే.. ఉదయాన్నే చిరాకుగా ఉండటం, దంపతులు ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే పెళ్లి అయిపోయి.. పిల్లలు పుట్టిన వారికి శృంగారం గురించి, దాని ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఎంతో అనుభవం ఉన్న వారికి కూడా రాత్రి సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవేంటంటే ముఖ్యంగా మీ భాగస్వామి మీతో శృంగారానికి ఓకే చెప్పకపోవచ్చు. మీరు పగలు ఇంట్లో ఎంత గొప్ప హీరో అయినా.. రాత్రి మాత్రం మీ భార్య పాదదాసుడే అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మరి.. మీ భాగస్వామితో అందుకు ఎలా ఓకే చెప్పించుకోవాలో తెలుసుకోండి.
మీరు బయట ఉద్యోగం చేయచ్చు.. కుటుంబ అవసరాలను మీరే తీరుస్తూ ఉండచ్చు. కానీ, ఇల్లుచక్కదిద్దేది మాత్రం ఆడవాళ్లు అనే విషయాన్ని అంగీకరించాల్సిందే. ఇంట్లో అందరికి కావాల్సినసి చేసి పెడుతూ, ఎవరికి ఏం అవసరం వచ్చినా దగ్గరుండి చేసి పెడుతూ ఉంటారు. అలాంటి ఆడవాళ్లు సాయంత్రం పూట కచ్చితంగా అలసిపోతారు. మీరు అలాంటి సమయంలో నేరుగా వెళ్లి వారిని శృంగారానికి ప్రేరేపిస్తే వాళ్లు విసుక్కుంటారు. కాబట్టి ఆమె అలసటగా ఉందని తెలిస్తే.. ముందుగా ఆమెను పలకరించండం. ఆమెకు ఏమైనా ఇబ్బంది ఉందేమో తెలుసుకోండి. ఒకవేళ ఒళ్లు నొప్పులు, నడుపు నొప్పి, తలనొప్పి వంటివి ఉన్నాయని చెబితే.. వాటిని దూరం చేసేందుకు ప్రయత్నాలు చేయండి.
చక్కగా జండూబామ్ తీసుకొచ్చి వారికి మర్దనా చేయండి. ఆ తర్వాత మీలో ఉన్న శృంగార కోరికను వారికి తెలిసేలా చేయండి. దగ్గరకు తీసుకుని చుంబించడం, వారిని సున్నితంగా హత్తుకోవడం చేయండి. వారికి విషయం అర్థమయ్యి.. మిమ్మల్ని ప్రోత్సహిస్తే ప్రొసీడ్ కావచ్చు. కానీ, అందుకు వారు అంగీకరించకపోతే మాత్రం అస్సలు ఫోర్స్ చేయకండి. ఆ రోజుకి వారిని విశ్రాంతి తీసుకోనివ్వండి. నేను కట్టుకున్న భార్యే కదా.. తనని మళ్లీ ఇంప్రెస్ చేసేంది ఏంటి? అనే భావనలో మీరు ఉంటే వెంటనే బయటకు వచ్చేయాలి. ఎందుకంటే భార్యను కూడా ఇంప్రెస్ చేయాలి. అప్పుడప్పుడు వారికి చిన్న చిన్న గిఫ్ట్స్ కొనివ్వండి. ఆమెపై మీకున్న ప్రేమను వారికి తెలిసేలా చేయండి. మీరు చూపించే ప్రేమను వారు అర్థం చేసుకుంటే.. రోజూ మీకు శుభరాత్రే అవుతుంది.
అలాగే భార్య, భర్త ఇద్దరూ ఉదయం ఎంత హడావుడిగా ఉన్నా కూడా.. రాత్రికి మాత్రం చక్కగా స్నానం చేసి.. బెడ్ మీద కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. రాత్రే కదా అని ఎలా పడితే అలా డ్రెస్ వేసుకోకూడదు. మంచి దుస్తులు వేసుకోవాలి. మీ పార్టనర్‌ని ఆకర్షించేలా, వారికి నచ్చేవి అయితే ఇంకా మంచిది. ఉదయం పూట మీరెవరో.. ఆమెవరో అన్నట్లు అస్సలు ఉండొద్దు. ఎందుకంటే చీకటి పడిన తర్వాత మాత్రమే మీరు ఆమె దగ్గరకు వెళ్తే.. వారికి నెగెటివ్ భావనలు వస్తాయి. అంటే నేను కేవలం ఆ పనికి మాత్రమే పనికొస్తానా? అనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వంటగదిలో ఉన్నప్పుడు కాసేపు సరదాగా మాట్లాడండి. మీకు వంటలో ప్రవేశం ఉంటే ఆమెకు పనుల్లో సహాయం చేస్తుండండి. ఉదయం పూట ఎవరూ లేని సమయంలో చిలిపి సరసాలు కూడా ఆమెను ఉత్తేజంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా మీకు ఉన్న ప్రేమను వ్యక్త పరచడానికి అదే మంచి మార్గం.
మీరు మీ భాగస్వామితో ఎప్పుడూ అదే విషయం గురించి ప్రస్తావించకుండా ఉండమే మంచిది. ఎందుకంటే మీకు ఇంక అదే ఆలోచనా? అని విసుక్కునే ప్రమాదం కూడా ఉంది. అలాగే శృంగారం సమయంలో మీ భాగస్వామికి ఎలా ఉంటే ఇష్టమో మీకు తెలిసుండాలి. వారికి నచ్చిన విధంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా వారిలో శృంగార కోరికలను పుట్టించవచ్చు. వారికి ఆ ఉద్దేశం లేకపోయినా కూడా మీరు వారిని శృంగారానికి ఉసిగొలపొచ్చు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఈరోజు ఏం చేసావ్? ఎందుకు ఇంతలా అలిసిపోయావు? అని మాట్లాడండి. మీ ఆఫీస్‌లో ఏమైనా ఇంట్రెస్టింట్‌గా జరిగితే వారికి చెప్పండి. అలా మాట్లాడుతూనే మీ చేష్టలతో వారిని శృంగారానికి ప్రేరేపించండి. కానీ, ఒక్క షరతు మాత్రం బాగా గుర్తుంచుకోండి. శృంగారం అనేది ఇద్దరి మధ్య బంధం మరింత బలపడేలా చేసే ఒక చర్య. మీ భాగస్వామికి ఇష్టం లేకుండా శృంగారానికి అస్సలు ఫోర్స్ చేయకండి.