పల్లెటూరిలోని ఓ సగటు మహిళ కావచ్చు.. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ నగరంలో జీవించే ఉద్యోగిని కావచ్చు.. రాత్రి అయిందంటే చాలు చాలా మంది ఆడవాళ్లు నైటీలు వేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉంటే చాలు నైటీలు వేసేస్తుంటారు. భర్తలు దీన్ని ఎంత వ్యతిరేకించినా వారు మాట వినరు. తమకు నచ్చింది చేస్తూ ఉంటారు. శృంగారం సమయంలోనూ నైటీలకే ఆడవాళ్లు సుముఖత వ్యక్తం చేస్తుంటారు. దీంతో భర్తలు తెగ ఇబ్బంది పడిపోతుంటారు. కొంతమంది మగాళ్లు నైటీలో భార్యను చూడగానే మూడు మొత్తం పోగొట్టుకుంటారు. శృంగార సమయం కాస్తా గొడవగా మారిపోతుంది.
తర్వాతి కాలంలో ఇది ఇద్దరి మధ్యా పెద్ద అగాథాన్ని తెచ్చిపెడుతుంది. అయినా కొంతమంది మహిళలు వెనకడుగు వేయరు. వేసుకున్న నైటీనే ఉతక్కుండా మూడు, నాలుగు రోజులు వేసుకుంటూ ఉంటారు. అది మాసిపోయి, కంపు కొడుతూ ఉంటుంది. అయినా దాన్ని విప్పరు. అలాగే వేసుకుని తిరుగుతూ ఉంటారు. శృంగారం సమయంలోనూ దాన్ని అలాగే వేసుకుని పడుకుంటూ ఉంటారు. దీంతో భర్తకు అది ఇబ్బందిగా మారుతుంది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న అతడి ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుంది. వాస్తవానికి నైటీలు వేసుకోవటం వల్ల ఆడవాళ్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి.
వారు నైటీల్లో ఎంతో కంఫర్టబుల్‌గా ఫీలవుతూ ఉంటారు. చీరలు, పంజాబీ డ్రెస్సులు, ఇతర బిగుతు దుస్తుల్లో గంటలు గంటలు గడిపి ఇబ్బందికి గురైన వారికి నైటీతో స్వేచ్ఛ లభించినట్లు అవుతుంది. అందుకే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నైటీలు వేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. మగాళ్లు ఎలాగైతే పంచెల్లో ఫ్రీగా ఉంటారో.. అలాగే స్త్రీలు కూడా నైటీల్లో ఫ్రీగా ఉండగలుగుతారు. అయితే, నైటీలను వేసుకోవాల్సిన విధంగా, వేసుకోవాల్సిన సమయంలో వేసుకోవాలి. శృంగారం సమయంలో భర్త మూడ్‌ను పెంచే దుస్తుల్ని వేసుకోవాలి. అంతేకాదు! నైటీల్లో శృంగారానికి ఉపక్రమిస్తుంటే గనుక తప్పని సరిగా అవి శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పరిశుభ్రమైన నైటీని శృంగారానికి వాడాలి. నైటీ కోసం కాపురాన్ని కూల్చే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు.