ఆఫ్ట్రాల్ సిగరెట్ ప్యాక్ మీదే “నన్ను తాగొద్దు పోతారు” అని చెప్పినప్పుడు ఈ రాశి వారిని గెలకద్దు పోతారు అని చెప్పకపోతే ఎలా? కాబట్టి కొన్ని రాశులకి చెందిన స్త్రీల జోలికి పోకూడదనే కొందరు నమ్మే శాస్త్రం చెబుతోంది. యాక్చువల్ గా స్త్రీల జోలికి పోకూడదు. అందులోనూ ఇప్పుడు చెప్పబోయే రాశి మహిళల జోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే ఇలాంటి స్త్రీలతో ఆటలంటే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడినట్టే అవుతుందని ఓ పెద్ద మనిషి చెప్పాడు లెండి. స్త్రీలు కాబట్టి చాలా సౌమ్యంగా ఉంటారు. ఈజీగా మ్యానేజ్ చేసేయచ్చు, మన దారిలోకి తెచ్చుకోవచ్చు అని అందరి మహిళలతో దుర్బిద్ధితో ప్రవర్తించినట్టు ఈ రాశి వారితో ప్రవర్తిస్తే అంతే సంగతులు. జ్యోతిష్యం ప్రకారం.. ఆత్మవిశ్వాసం, భయం లేకపోవడం, మొండి పట్టుదల వంటి లక్షణాలు ఈ రాశుల మహిళల సొంతం. మరి ఆ రాశులకి చెందిన మహిళలు, వారి లక్షణాలు ఏంటో ఓ లుక్కేయండి.
మేష రాశి
అత్యంత శక్తివంతమైన రాశుల్లో మేష రాశి ఒకటి. మేష రాశికి చెందిన మహిళలు బలంగా, ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఈ రాశి అంతర్గతంగా అగ్ని, శక్తి నిండి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఉద్రేక పూరితంగా ఉంటారు. ఈ రాశి వారితో ఆటలంటే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడినట్టే.
వృషభ రాశి
వృషభ రాశికి చెందిన స్త్రీలు శక్తివంతులు మరియు స్వతంత్రంగా ఉంటారు. తెలివితేటలు కూడా ఎక్కువే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విజయం సాధిస్తారు. మొదలుపెట్టిన ఏ పనినీ మధ్యలో వదిలిపెట్టరు. బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం ఈ రాశి వారి లక్షణం.
సింహ రాశి
సింహంతో వేట, ఈ రాశి మహిళలతో ఆటలు ఆడకూడదు. ఒక్కసారి మొదలుపెడితే కబడ్డీ ఆడేస్తారు. సింహ రాశికి చెందిన మహిళలు ధృడ నిశ్చయంతో ఉంటారు. పట్టుదల ఎక్కువ. ఏదైనా సాధించాలి అని అనుకుంటే సాధించే వరకూ వదిలిపెట్టరు. అది పనికొచ్చే పనైనా, పనికిరాని పగయినా, ఏదైనా గానీ అనుకుంటే సాధించకుండా వదిలిపెట్టరు. ఏ రంగంలో ఉన్నా బలమైన ఈ రాశి మహిళలు లీడర్లుగా ఎదుగుతారు. సింహ రాశి మహిళలు ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారు. సహజమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఆర్టిఫిషియల్ గా జీవించడం వీరికి రాదు. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
మకర రాశికి చెందిన అమ్మాయిలు చాలా కష్టపడతారు. ఎంచుకున్న వృత్తిలో కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ధృడ సంకల్పంతో జీవిస్తుంటారు. ఈ రాశికి శని గ్రహం అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ గ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వారు మంచి గుణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా తండ్రి గర్వపడే స్థాయిలో ఉంటారు. వీళ్ళ దృష్టిలో ప్రేమ అనే కాన్సెప్ట్ చాలా చిన్నది. ప్రేమ పేరుతో వీళ్ళు కాలయాపన చేయరు. ఉన్నతమైన లక్ష్యం చేరుకోవడం కోసం నిరంతరం పరితపిస్తుంటారు. ఈ రాశి మహిళలతో అంత ఈజీ కాదు.
ధనుస్సు రాశి
ఇక ఫైనల్ గా ధనుస్సు రాశికి చెందిన మహిళలు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. విపరీతమైన భావోద్వేగం కలిగి ఉంటారు. ఇతరులపై సానుభూతి చూపుతుంటారు. ఇతరులలో మార్పులు తీసుకొచ్చే విధంగా వీరి ప్రవర్తన ఉంటుంది. కానీ అంత తేలిగ్గా వీరు మనసు మార్చుకోవడం అనేది జరగదు. ఏ అమ్మాయైనా వారానికి పడుద్ది, ఏడాదికి పడుద్ది అని ఈ రాశి అమ్మాయిలతో పిచ్చి వేషాలు వేస్తే రంగు పడుద్ది. ఎలాంటి దురుద్దేశం లేకుండా వీళ్ళతో కలిసి జీవించాలి అనుకుంటే టన్నుల్లెక్కన సహనం ఉండాలి. అదన్నమాట విషయం.
గమనిక:
ఈ వ్యాసం కేవలం ప్రజల విశ్వాసాలు, అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఉన్నారు. నమ్మనివారు ఉన్నారు. ఎవరి నమ్మకాలు వారివి. కాబట్టి పర్సనల్ గా తీసుకోకండి. ఇది ఖచ్చితంగా వాస్తవమే అని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అలా అని ఖచ్చితంగా తప్పు అని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. కానీ ఆడవారిని తేలికగా తీసుకునే అభిప్రాయంతో ఉండడం మాత్రం మంచిది కాదని చెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అసలు వీడు భర్తేనా..? కన్న పిల్లల ముందే భార్యపై భర్త దారుణం!
ఇది కూడా చదవండి: పాపం.. ఈ తల్లికి ఏం కష్టం వచ్చిందో!