నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పడింది. డిగ్రీ పూర్తి చేసిన వారికి మంచి జీతంతో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిగ్రీ పాసయ్యారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అవకాశం. ఈ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ పాసైన వారికి తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి. డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. మరి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? దరఖాస్తు ఫీజు ఎంత? జీతభత్యాలు ఎలా ఉంటాయి? వంటి వివరాలు మీ కోసం.