ప్రభుత్వం ఉద్యోగం చేయాలనేది మీ కల అయితే ఇదే మీకు మంచి అవకాశం. పదవ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటే కనుక మీరు ఈ ఉద్యోగానికి అర్హులు. తాజాగా 5369 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అందుకోసం జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలా ఎదురుచూసే నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్ పాసయ్యారా? ఇంటర్ చదివారా? డిగ్రీ పూర్తి చేశారా? మీ అర్హత ఏదైనా గానీ అర్హతకు తగ్గా ప్రభుత్వ ఉద్యోగం మీ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5369 పోస్టులను భర్తీ చేయనుంది. మరి ఆ పోస్టూలేమిటి? అర్హతలు ఏమిటి? వయసు పరిమితి ఎంత ఉండాలి? వంటి వివరాలు మీ కోసం.
అర్హతలు: పోస్టును బట్టి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.