SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » jobs » Reliance Foundation Scholarships For Degree And Pg Students

విద్యార్థులకు ఈ ఒక్క అర్హత ఉంటే.. ఉచితంగా రూ.2 లక్షలు! మంచి అవకాశం!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 3 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విద్యార్థులకు ఈ ఒక్క అర్హత ఉంటే.. ఉచితంగా రూ.2 లక్షలు! మంచి అవకాశం!

ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న విద్యార్థులు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వచ్చే పదేళ్లలో 50,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించనుంది. అందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5100 స్కాలర్‌షిప్‌ల అందించబోతున్నారు. ఇందులో 5000 స్కాల‌ర్‌షిప్స్‌ అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల‌కు కాగా, 100 స్కాల‌ర్‌షిప్స్‌ పీజీ విద్యార్థుల‌కు ఇవ్వనున్నారు. ఈ స్కాల‌ర్‌షిప్స్‌ పొందడానికి అర్హతలేంటి..? ఎలా అప్లై చేయాలి..? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిగ్రీ, పీజీ వంటి పైచదువులు చదవాలనుకున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్స్ పొందడానికి అర్హులు. ఎంపికైనవారికి కోర్సు వ్యవధి అంతా ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్ నేపథ్యం, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు ఫిబ్రవరి 14 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిభగల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ చక్కగా ఉపయోగపడుతుంది.

డిగ్రీ స్థాయిలో రూ. 2 లక్షలు

అర్హతలు:

  • ఇంటర్‌ పూర్తి చేసిన వారు లేదా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇంటర్‌ లేదా ప్లస్‌-2లో 60 శాతం మార్కులతో  ఉతీర్ణులై ఉండాలి.
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉండాలి. అయితే రూ.2.5 లక్షల లోపు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు.
  • విద్యార్థినులు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యమిస్తారు.

కావాల్సిన డాక్యుమెంట్స్:

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అడ్రస్ ప్రూఫ్‌, 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్ మార్క్స్ షీట్‌తో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బోనఫైడ్‌ సర్టిఫికెట్ ఉండాలి. వీటితో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఇన్‌కమ్‌ ప్రూఫ్‌) సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

మెరిట్ ప్రాతిపదికన మరియు ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులకు ఫ్రీగా ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు. వెర్బల్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 20చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. 60 నిమిషాల సమయం ఉంటుంది. ఆప్టిట్యూడ్‌ టెస్టు స్కోరు, అకడమిక్, పర్సనల్‌ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చిలో ప్రకటిస్తారు. మొత్తం 5 వేల మందికి స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేయనున్నారు.

రూ. 2 లక్షల స్కాలర్‌షిప్:

ఎంపికైనవారికి డిగ్రీ పూర్తయ్యేలోపు సుమారు రూ.2 లక్షల వరకుఆర్థిక ప్రోత్సాహం పొందవచ్చు. అలాగే.. వీరికి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్ పరంగానూ సహకారమూ లభిస్తుంది. అంటే, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, వర్క్ షాపులు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో అనుసంధానం మొదలైనవి ఉంటాయి.

పీజీ స్థాయిలో రూ. 6 లక్షలు

అర్హతలు:

  • పీజీ మొదటి ఏడాది కోర్సు చదువుతున్న వారు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు.
  • గేట్‌లో 550-1000 మధ్య స్కోర్, లేదా యూజీలో 7.5 సీజీపీఏ ఉత్తీర్ణత ఉండాలి.
  • దేశంలో ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రిలయన్స్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌లో ఎలిజిబిలిటీ క్వశ్చనీర్‌ను పూర్తిచేయాలి. పర్సనల్, అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ వివరాలు నమోదు చేసుకోవాలి. రెండు రిఫరెన్స్‌ లెటర్లు జతచేయాలి. వీటిలో ఒకటి అకడమిక్‌ నైపుణ్యాలు, రెండోది వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు తెలిపేదై ఉండాలి. రెండు ఎస్సేలు ఒకటి పర్సనల్‌ స్టేట్‌మెంట్, రెండోది స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ రాసివ్వాలి. దరఖాస్తుల పరిశీలనలో నిలిచినవారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వెబినార్లు ఉంటాయి. ఇందులో ఎంపికైన వంద మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తారు.

రూ. 6 లక్షల స్కాలర్‌షిప్:

కోర్సు వ్యవధికి మొత్తం రూ.6 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 80 శాతం విద్యా సంవత్సరం ప్రారంభంలో, మిగతా 20 శాతం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, కాన్ఫరెన్సులు, పర్సనల్ డెవలప్‌మెంట్… తదితర ఖర్చుల కోసం చెల్లిస్తారు.

గమనిక: అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ‘స్కాలర్‌షిప్స్‌.రిలయన్స్‌ఫౌండేషన్‌‘ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Tags :

  • Employment News
  • Reliance Foundation
  • Scholarship
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Mukesh Ambani: లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్‌ అంబానీ! ధర ఎంతో తెలిస్తే ఔరా అంటారు!

Mukesh Ambani: లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్‌ అంబానీ! ధర ఎంతో తెలిస్తే ఔరా అంటారు!

  • ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

    ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

  • 8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

    8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

  • ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం.. అస్సలు మిస్ చేసుకోకండి.

    ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం.. అస్సలు మిస్ చేసుకోకండి.

  • EMRS Recruitment 2023: ఇంటర్ అర్హత ఉంటే చాలు నెలకు రూ. 56 వేలు జీతం!.. అనుభవం అక్కర్లేదు

    EMRS Recruitment 2023: ఇంటర్ అర్హత ఉంటే చాలు నెలకు రూ. 56 వేలు జీతం!.. అనుభవం అక్కర్లేదు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam