రెగ్యులర్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ కి సంబంధించిన భారతీయ స్టేట్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ పోస్టుకి సంబంధించిన పలు పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కోర్స్ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి పోస్టును బట్టి నెలకు రూ. 60 వేల నుంచి రూ. 89 వేల వరకూ జీతం చెల్లిస్తారు. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి పోస్టింగ్ ఎక్కడ? అర్హతలు ఏంటి? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? వంటి వివరాలు మీ కోసం.