కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ, డిప్లోమా అర్హత కలిగిన అభ్యర్థులను కోరుతుంది. 1545 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆయిల్ రిఫైనరీస్ లో పలు విభాగాలకు సంబంధించి పోస్టులను ప్రకటించింది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 23 లోపు దరఖాస్తులను సబ్మిట్ చేయాలని కంపెనీ నోటిఫికేషన్ లో పేర్కొంది. రిజర్వేషన్ల వారీగా పోస్టులను ప్రకటించింది. అటెండెంట్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్ అప్రెంటిస్ వంటి పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.