భారతీయ పోస్టాఫీస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చెన్నైకి చెందిన మెయిల్ మోటార్ సర్వీస్ లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆఫీస్ ఆఫ్ సీనియర్ మేనేజర్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగాల్లో పలు పోస్టులకు అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. 8వ తరగతి పాసైన అభ్యర్థులు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మరి ఆ పోస్టులు ఏంటి? ఆ పోస్టులకి జీతం ఎంత ఇస్తారు? ఇంకా ఏమైనా అర్హతలు కావాలా? ఎలా అప్లై చేసుకోవాలి? ఆఖరు తేదీ ఎప్పుడు? వంటి వివరాలు మీ కోసం.