సెంట్రల్ రైల్వేలో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్మెంట్ సెల్. సెంట్రల్ రైల్వే అధికార పరిధిలోని వర్క్ షాప్స్/యూనిట్లలో 2422 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్ వంటి పలు పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి.. దేశంలోని పలు క్లస్టర్స్ లో ఉన్న సెంట్రల్ రైల్వే యూనిట్లు, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వేల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. మరి ఈ పోస్టులు ఏంటి? పోస్టుకి కావాల్సిన అర్హతలు ఏమిటి? జీతం ఎంత ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.