ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు క్యారీడ్ ఫార్వార్డ్ వేకెన్సీలు, 90 తాజా వేకెన్సీలను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపింది. డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ వంటి పలు పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మరి నోటిఫికేషన్ లో ఉన్న పోస్టులు ఏంటి? పోస్టుకు అప్లై చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? జీతం ఎంత? అనే వివరాలు మీ కోసం.