ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ముందే ఆర్సీబీ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు.
ఐపీఎల్ కు అంతా రెడీ. రేపటి నుంచి అంటే మార్చి 31న చెన్నై-గుజరాత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ తో 15వ సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ కానుంది. వేరే అన్ని జట్ల ఫ్యాన్స్ ఏమో గానీ ఎప్పటిలానే బెంగళూరు ఫ్యాన్స్ ఈసారి కూడా సేమ్ స్లోగన్ తో వచ్చేశాడు. ‘ఈ సాలా కప్ నమదే’ అని సీజన్ స్టార్ట్ కావడానికంటే ముందే తెగ సందడి చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆర్సీబీ ఫ్యాన్స్ చేదు వార్త వినిపించింది. జట్టులోని కీలకమైన స్టార్ ప్లేయర్ దూరం కానున్నాడనే న్యూస్ అందరూ కలవరపడేలా చేసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి సీజన్ లో అద్భుతమైన ఎక్స్ పెక్టేషన్స్ తో బరిలో దిగే జట్లలో చెన్నై, ముంబయి కచ్చితంగా ఉంటాయి. వాటితో పాటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పక్కాగా ఉంటుంది. కానీ తొలి సీజన్ నుంచి ఈ జట్టుని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్లో అడుగుపెట్టినప్పటికీ అన్నిసార్లు నిరాశే ఎదురైంది. ఇక ఈ సీజన్ మొత్తం నెక్స్ట్ లెవల్ ఉండనుందని అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి ఫామ్ లో లేని కోహ్లీ కూడా టీమిండియా తరఫున వరస సెంచరీలు చేశాడు. దీంతో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.
ఇలా అంతా ఐపీఎల్ కొత్త సీజన్ విషయంలో ఆర్సీబీకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న జోష్ హేజిల్ వుడ్.. ప్రారంభంలో కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా స్వయంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే స్టార్ బౌలర్ దూరమయ్యాడని ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. అదే టైంలో కొన్ని మ్యాచులే కదా అని సర్ది చెప్పుకొంటున్నారు. మరి ఆర్సీబీ బౌలర్.. ఐపీఎల్ మ్యాచులకూ దూరం కావడంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
Cricket Australia confirms Josh Hazelwood will miss the initial matches of IPL 2023.
— Johns. (@CricCrazyJohns) March 30, 2023