కెప్టెన్సీలో ధోనీ మార్క్ వేరే లెవల్. అలాంటిది ఇప్పుడు ఏకంగా మహీనే ఓ విషయంలో హార్దిక్ పాండ్య దాటేశాడు. సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకీ ఏంటి విషయం?
టీమిండియాలో కావొచ్చు.. ఐపీఎల్ లో కావొచ్చు.. నంబర్ వన్ కెప్టెన్ ఎవరు? అంటే ఫ్యాన్స్, క్రికెటర్లు అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ మహేంద్ర సింగ్ ధోనీ. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. అప్పటినుంచి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నైకి కెప్టెన్సీ చేస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ జట్టు తరఫున ఇప్పటికే నాలుగు కప్పులు సాధించిన ధోనీ.. తాజా సీజన్ లోనూ సీఎస్కేని విజేతగా చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. కెప్టెన్సీలో మహీకి పోటీగా హార్దిక్ పాండ్య రయ్ మంటూ దూసుకొస్తున్నాడు. తాజాగా సరికొత్త రికార్డు కూడా నమోదు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ లో కప్ గెలవాలని ప్రతి జట్టు తెగ కష్టపడుతుంటాయి. కానీ కొన్ని టీమ్స్ ని మాత్రమే ఆ అదృష్టం వరిస్తూ ఉంటుంది. గత సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. ఏకంగా కప్ కూడా కొట్టేసింది. ఈసారి కూడా ప్రతి మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ టైటిల్ రేసులో ముందుంది. తాజాగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో గుజరాత్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ హార్దిక్ సేన.. 207/6 స్కోరు చేసింది. ఛేదనలో ముంబయి 152/9 కే పరిమితమైంది. దీంతో ఈ సీజన్ లో ఐదో విజయాన్ని నమోదు చేసింది.
గత సీజన్ లోనూ గుజరాత్ జట్టుని ముందుండి నడిపించిన హార్దిక్ పాండ్య.. ఇప్పటివరకు మొత్తంగా 21 మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. వాటిలో 15 మ్యాచుల్ని గెలిపించాడు. అంటే 75 శాతం విజయాలతో ఉన్నాడు. కనీసం 20 మ్యాచుల్లో విజయాల్ని తీసుకుంటే.. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ గా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యనే టాప్ లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో ధోనీ 58.99%, సచిన్ 58.82%, స్టీవ్ స్మిత్ 58.14%తో ఉన్నారు. కెప్టెన్ గా హార్దిక్ ఇదే ఊపు కంటిన్యూ చేస్తే మాత్రం ఈసారీ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి కెప్టెన్ గా ధోనీ రికార్డుని హార్దిక్ బ్రేక్ చేయడం గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Some achievement that from Hardik Pandya but a long way to go. #ipl2023 #GTvsMI pic.twitter.com/7MfGWgUuMj
— Ridhima Pathak (@PathakRidhima) April 25, 2023