చెన్నై ఐదోసారి కప్ కొట్టింది. ఆల్రెడీ నాలుగుసార్లు గెలుచుకుంది కాబట్టి ఇందులో పెద్ద గొప్పేం లేదు. కానీ ధోనీ ఎమోషనల్ కావడం, జడేజాని ఎత్తుకోవడం చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కి ఫినిషింగ్‌తో రిలీఫ్ ఇస్తే అతడిని ధోనీ అంటారు. అదే ధోనీకే ఫినిషింగ్‌తో రిలీఫ్ ఇస్తే అతడిని ‘సర్’ రవీంద్ర జడేజా అంటారు. తాజాగా ఐపీఎల్ ఫైనల్లో చెన్నై గెలవడానికి జట్టులోని అందరూ కారణం అయ్యిండొచ్చు కానీ జడేజా చివర్లో సిక్స్, ఫోర్ కొట్టకపోయింటే.. ఈ రేంజు సెలబ్రేషన్స్ ఉండేవి కావు. ధోనీ ముఖంలో నవ్వు కనిపించేది కాదు. ఈ మ్యాచ్ లో చెన్నై గెలిచిన తర్వాత రవీంద్ర జడేజాని ధోనీ ఎత్తుకున్నాడు. నార్మల్ గా చూస్తే ఇది జస్ట్ ఓ ఎమోషనల్ మూమెంట్.. కానీ కరెక్ట్ గా చూస్తే ఇది ఎంత స్పెషల్ అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు చెన్నై అభిమాని అయితే ఇంకా బాగా అర్ధమవుతుంది. అదేంటో తెలియాలా? లేటు చేయకుండా పూర్తిగా చదివేయండి.
అసలు విషయానికొచ్చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే క్రికెట్ చూసే ప్రతిఒక్కరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ జట్టులోని పవర్ అలాంటిది. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు. తాజా విజయంతో కలిపి ఐదుసార్లు చెన్నైని విజేతగా నిలిపాడు. అయితే ధోనీకి ఫైనల్లో కప్ కొట్టడం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే ఐసీసీ టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. చెన్నై ఐదుసార్లు విజేతగా నిలిచింది కూడా ధోనీ కెప్టెన్సీలోనే. ఈసారి ధోనీ వల్ల జడేజా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు.
అదేంటి ధోనీ వల్ల జడేజా ఇబ్బంది పడటం ఏంటా అని మీరనుకుంటున్నారేమో.. ఈ సీజన్ లో చెన్నై ఆడిన ప్రతి మ్యాచ్ కు వేలాది మంది జనం స్టేడియంకి వచ్చారు. ధోనీ బ్యాటింగ్ చూడాలని పిచ్చెక్కిపోయారు. ప్రతి మ్యాచ్ లోనూ బ్యాటింగ్ కి జడేజా వచ్చిన టైంలో ‘త్వరగా ఔట్ అయిపో’ అన్నట్లు అరిచి గోలగోల చేశారు. ఇదంతా జడ్డూపై కోపంతో కాదు ధోనీ చూడాలనే ఆశతో. వీటన్నింటినీ తట్టుకుంటూనే ఆడుతూ వచ్చాడు. ఈ మధ్య ధోనీతో గొడవ జరిగిందో, మరే విషయమో తెలీదు గానీ జడేజా ఓ వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీంతో అందరూ తలో రకంగా అనుకున్నారు. అలాంటి ఈ టైంలో ఫైనల్ జరిగింది. ఫ్యాన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్న ధోనీ.. డకౌట్ అయిపోయాడు. ఇన్నాళ్లు ఫ్యాన్స్.. ఔటైపో ఔటైపో అన్న జడేజానే చివర్లో సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. ఐదోసారి కప్ ముద్దాడేలా చేశాడు.
ఈ విన్నింగ్ మూమెంట్ తర్వాత జడేజా గ్రౌండ్ మొత్తం తిరుగుతూ సందడి చేశాడు. తన కెప్టెన్, గురువు అయిన ధోనీ దగ్గరికి వచ్చాడు. అందరూ ఇదే ధోనీకి చివరి సీజన్ అని అంటున్నారు. వర్షం వల్ల ఫైనల్ మూడు రోజులు జరిగింది. ఇలాంటి ఈ మ్యాచ్ లో గెలుస్తామా లేదా అని ధోనీ టెన్షన్ పడటం కూడా ఫస్ట్ టైం చూశాం. అలాంటి ఈ మ్యాచ్ గెలవడానికి కారణమైన జడేజా మెచ్చుకోవాలని అనుకున్నాడు. అది మాటల్లో చెబితే సరిపోదు అని గర్వంగా ఎత్తుకుని మరీ జడేజా తనకు ఎంత స్పెషలో చెప్పకనే చెప్పాడు. తమ మధ్య ఎలాంటి గొడవల్లాంటివి లేవని క్లారిటీ ఇచ్చేశాడు. అందుకే చెన్నై ఐదోసారి కప్ కొట్టడం కంటే జడేజాని ధోనీ ఎత్తుకుని ఎమోషనల్ అయిన ఈ మూమెంట్.. ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా స్పెషల్. మరి ఈ ఫొటో, వీడియో చూడగానే మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.
𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🤩
Celebrations all around in Chennai Super Kings’ camp!
#TATAIPL | #CSKvGT | #Final | @ChennaiIPL pic.twitter.com/81wQQuWvDJ
— IndianPremierLeague (@IPL) May 29, 2023