చెన్నై సూపర్ కింగ్స్ పై మరోసారి బ్యాన్ పడనుందా? అవును మీరు విన్నది కరెక్టే. ఓ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారానికి కారణమయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది?
ఐపీఎల్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. మరీ ముఖ్యంగా కెప్టెన్ ధోనీకి కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ టీమ్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు.. టీవీల ముందు అభిమానులకు కదలకుండా కూర్చుంటారు. అలాంటి ఫాలోయింగ్ సీఎస్కే సొంతం. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా గతంలో రెండేళ్ల నిషేధానికి గురైంది. ఇప్పుడు మరోసారి చెన్నై జట్టుపై బ్యాన్ అనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. అసలేం జరిగిందా అని తెలుసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. మీలో కొంతమంది అనుకుంటున్నట్లు ఇవి రూమర్స్ అయితే కాదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ లో బ్యాన్ అనే పేరు చెబితే రాజస్థాన్, చెన్నై జట్లు గుర్తొస్తాయి. ఫిక్సింగ్, బెట్టింగ్ కు సంబంధించి 2016-17.. ఇలా రెండేళ్లపాటు టోర్నీ నుంచి నిషేధించారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చెన్నై.. సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చి కప్ కొట్టింది. ఇప్పుడు మరోసారి చెన్నై టీమ్ ని బ్యాన్ చేయాలనే అంశం తెరపైకి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీలో తాజాగా పీఎంకే ఎమ్మెల్యేలు ఈ డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన ఒక్క ఆటగాడు కూడా జట్టులో లేడని, అలాంటప్పుడు చెన్నై టీమ్ ఎందుకని ఎమ్మెల్యే ఎస్పీ వెంకటేశ్వరన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలామంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, కానీ వాళ్లకు ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ ఇవ్వట్లేదని మండిపడ్డారు.
అదే టైంలో తమిళనాడు క్రీడాశాఖ దీనిపై ఎందుకు స్పందిచట్లేదని సదరు ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఐపీఎల్ పేరిట చెన్నై టీమ్ వ్యాపారం చేస్తోందని అసెంబ్లీలోనే నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ పై చర్యలు తీసుకోవాలని సదరు పీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తమిళనాడు పేరు వాడుకుని సీఎస్కే భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోందని, మన ఆటగాళ్లని మాత్రం పక్కనబెట్టేసిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఎమ్మెల్యే చెప్పినట్లు చూసుకుంటే.. ఐపీఎల్ లో ఆడే చాలా జట్లలో సదరు రాష్ట్ర ఆటగాళ్లు లేరని నెటిజన్స్ చెబుతున్నారు. అయితే చెన్నై జట్టుపై నిషేధమైతే ఉండకపోవచ్చు గానీ ఈ చర్చ మాత్రం కొన్నిరోజులు ఉండటం గ్యారంటీ అనిపిస్తోంది. మరి తమిళ ఎమ్మెల్యే.. చెన్నై టీమ్ పై చేసిన వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
CSK fight breaks out in #TamilNadu; PMK MLA wants ban on Chennai Super Kings over ‘no Tamil players’. @PramodMadhav6 gets us this report.
Full video of #6PMPrime with @Akshita_N – https://t.co/p65rA6p2cb pic.twitter.com/Wcx0Hwq19k— IndiaToday (@IndiaToday) April 11, 2023