ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాదాపు విజయం ఖాయమనుకున్న దశలో ముంబై హిట్టర్ టిమ్ డేవిడ్ రనౌటవ్వడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా స్టేడియంలోని కార్పొరేట్ బాక్స్‌లో కూర్చుని ఎంజాయ్ చేసిన సారా టెండూల్కర్.. టిమ్ డేవిడ్ రనౌటవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పగా గెలువాల్సిన పోరులో.. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు హైదరాబాద్ ఆఖరి బంతికి గట్టెక్కింది. మొదట బ్యాటింగ్‌లో త్రిపాఠి, గార్గ్, పూరన్ రాణించడంతో మంచి స్కోరు చేసిన సన్‌రైజర్స్.. ముంబైని అడ్డుకునేందుకు ఆపసోపాలు పడింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణించడంతో ఒక దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ముంబైకి.. ఉమ్రాన్ బ్రేక్స్ వేయగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ పిడుగుల్లాంటి షాట్లతో రైజర్స్‌ను భయపెట్టాడు. ముంబై విజయానికి 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన దశలో నటరాజన్ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన డేవిడ్.. ఆఖరి బంతికి అనూహ్య రీతిలో రనౌట్ కావడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన సచిన్ కుమార్తె సారా.. టిమ్ డేవిడ్ ఔటవ్వడాన్ని తట్టుకోలేకపోయింది. తొలుత ఆ రనౌట్‌ని నమ్మలేనట్లు చూసిన సారా.. టిమ్ డేవిడ్ పెవిలియన్‌కి వెళ్తున్నప్పుడు ఎమోషనల్ అయిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
What an incredible innings from Tim David 👏👏, Sara Tendulkar 😢😭 after tim David Got out. pic.twitter.com/CeAHlFAHda
— Cricket Apna l Indian cricket (@cricketapna1) May 17, 2022
Sara didn’t enjoy that Tim David run out #IPL2022 pic.twitter.com/X2rOVNQgcz
— India Fantasy (@india_fantasy) May 17, 2022
ఇది కూడా చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ గెలవాలని RCB ఫ్యాన్స్ ప్రార్థనలు
సారా టెండూల్కర్ సోదరుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబైయి ఇండియన్స్ జట్టులోనే ఉండగా.. సచిన్ టెండూల్కర్ ఆ టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సారా తన సోదరుడు అర్జున్ ఈ మ్యాచులో అరంగేట్రం చేస్తాడని భావించి ఈ మ్యాచ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఏ మ్యాచులో జట్టులో స్థానం లభించలేదు. ఇక ముంబై ఇండియన్స్ తరువాత మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచులో సచిన్ తనయుడు అరంగ్రేటం చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. మరి ముంబై జట్టుకు సచిన్ కుటుంబం ఇస్తున్న మద్దతుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Mumbai Indians have finished at the bottom of the points table for the first time in their IPL history 🤯#ipl #ipl2022 pic.twitter.com/Uy2lOQcGmv
— Sportskeeda (@Sportskeeda) May 18, 2022
Points Table IPL 2022 Till Match 65 🏆. #IPL #IPL2022 #IPLTATA #GT #RR #RCB #SRH #LSG #PBKS #CSK #MI pic.twitter.com/1VPE1msoTW
— CricCircle (@thecriccircle) May 18, 2022