ఈ పోటీ ప్రపంచంలో మహిళలు రాత్రి, పగలు ఉద్యోగాలంటూ తిండి, తిప్పలు మరిచి పనిలో నిమగ్నమవుతుంటారు. ఇంకొంత మంది మహిళలు ఏకంగా సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల లేని పోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల మహిళలకు భవిష్యత్లో కాని ముందు ముందు కాని రోగాల బారిన పడే ప్రమాదముందని ఆరోగ్యరంగ నిపుణులు, వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా జరిపిన పరిశోధనల్లో ప్రోటీన్ లోపం వల్ల మహిళలకు పలు రకాల సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు తెలుపుతున్నారు.
ఇక ప్రతిరోజు మహిళలు తగినంత మోతాదులో ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల గుండెపోటు లేదా కొరోనరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజూ 110 గ్రాముల ప్రోటీన్ తీసుకోకపోవటం వల్ల మహిళలకు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉందట. వయస్సుతో ప్రోటీన్ లేకపోవడం వల్ల మహిళల ఎముకలు బలహీనపడటం, కండరాలు బలహీనంగా మారతాయని పలు పరిశోధనల్లో తేలింది.
ఇక మహిళలకు రోజుకు కనీసం 50 నుండి 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని తెలుపుతున్నారు. దీంతో సరైన సమయానికి ప్రొటీన్ తీసుకోవడం ద్వారా శరీర కణాలు, ఎంజైములు, ప్రతిరోధకాలు మరియు కండరాలను నిర్మించడంలో అమైనో ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగని మహిళలు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే గనుక బరువు పెరుగటం, కిడ్నీవంటి సంబంధిత సమస్యలు రావచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.