హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకుని ప్రమాదాలు జరిగి కుటుంబం ఛిన్నాభిన్నం అవుతోంది. మానసికంగా, శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో నష్టం జరుగుతుంది. అప్పటి వరకు కూడబెట్టుకున్న సొమ్ము ఒక్కసారిగా వైద్య చికిత్సకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలానే సమయానికి డబ్బులు లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటాము. ఇలాంటి ఆపద సమయాల్లో మనల్ని ఆదుకునేవి ఆరోగ్య పాలసీలు. చాలా మంది ఆరోగ్యపాలసీలు వృథా ఖర్చుగా భావిస్తుంటారు. కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని వయస్కుల వారికి వీటి ప్రాధాన్యత తెలుసొచ్చింది. ఇప్పుడు బెస్ట్ ఆరోగ్యపాలసీల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారికి ఎల్ఐసీ సంస్థ హెల్త్ కు సంబంధించి ఓ పాలసీ అందిస్తోంది. అదే జీవన్ ఆరోగ్య పాలసీ. ఈ పాలసీ కార్డు ద్వారా కుటుంబం మొత్తం ఒక్క రూపాయ ఖర్చులేకుండా వైద్యం చేయించుకోవచ్చు..
ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ కస్టమర్ల కోసం, అలానే కొత్తవారి కోసం ఎల్ఐసీ ఎన్నో పాలసీలను ప్రారంభిస్తుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు పొందే విధంగా అనేక రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు ఆరోగ్యం కోసం ఎల్ ఐసీ సంస్థ అందిస్తోన్న పాలసీల్లో ‘జీవన్ ఆరోగ్య పాలసీ’ ఒకటి. ఈ పాలసీలో చేరిన కుటుంబానికి ఓ హెల్త్ కార్డు ఇస్తారు. దాని ద్వారా ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు 24 గంటలపైన ఆసుపత్రిలో పొందే వైద్యం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం రాదు.
అయితే మనం తీసుకునే ప్రీమియం బట్టి.. ఈ పాలసీ బెనిఫిట్స్ ఉంటాయి. కాగా, ఎల్ఐసీ తీసుకువచ్చిన ఈ పాలసీతో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఒక్క పాలసీతో కుటుంబ సభ్యులందికి ఆరోగ్య భీమా వర్తిస్తుంది. ఈ పాలసీని 18 నుంచి 65 ఏళ్ల మధ్య కలిగిన వారు తీసుకోవచ్చు. అదే విధంగా పిల్లల విషయానికి వస్తే.. 25 ఏళ్ల వరకు, పెద్దలకు 80 ఏళ్లు వచ్చే వరకు పాలసీ వర్తిస్తుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్ లేదా సమీపంలో ఉన్న ఎల్ఐసీబ్రాంచ్ను సంప్రదించవచ్చు. ఇంకా ఈ పాలసీ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు కింది వీడియోను వీక్షించండి. అలానే పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.