హిందూ సంప్రదాయంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణం వల్ల చెడు ప్రభావాలు ఏర్పడతాయి అని భావిస్తారు. ఇక గ్రహణ ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది. ఈ సూర్యగ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు. ఆ వివరాలు..
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ రోజు అనగా.. ఏప్రిల్ 20న ఏర్పడింది. ఈ గ్రహణానికి ఒక ప్రత్యేక ఉంది. ఒకే రోజున మూడు గ్రహణాలు ఏర్పడుతుండటంతో.. దీన్ని హైబ్రీడ్ సూర్య గ్రహణం అంటున్నారు. ఇక ఇది 100 ఏళ్ల తర్వాత ఏర్పడ్డదని కొందరు అంటుంటే.. మరి కొందరు మాత్రం.. మళ్లీ 143 ఏళ్ల తర్వాత ఇలాంటి గ్రహణ ఏర్పడనుంది అని దీని ప్రత్యేకత గురించి చెబుతున్నారు. అయితే ఈ గ్రహణం ఇండియాలో కనిపించదు. దాంతో దీని ప్రభావం మన మీద ఉండదు అంటున్నారు. ఇక మన దగ్గర గ్రహణం అంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం.. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే లైన్‌లోకి రావడం వల్ల ఇలా గ్రహణాలు ఏర్పడతాయి. ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే.. సూర్యచంద్రులతో రాహుకేతువులు కలవడం వల్ల సంభవిస్తుంటాయి అని చెబుతారు.
గ్రహణ ఫలితాలు సాధారణంగా 40 రోజుల లోపల అనుభవానికి వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సూర్యగ్రహణం అయినా.. చంద్ర గ్రహణం అయినా సరే.. వాటి ఫలితాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. తేడా చాలా తక్కువ అని చెప్పాలి. ఇక నేడు ఏర్పడే గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.
మేష రాశిలో ఈ నెల 20న చోటు చేసుకుంటున్న సూర్యగ్రహణం వల్ల మిథునం, కర్కాటకం, ధనస్సు, కుంభరాశుల వారికి కొద్దిగా అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసి రావడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, రాదనుకున్న డబ్బు చేతికి అందడం, ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇవ్వడం వంటివి చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మరి ఆ నాలుగు రాశులు ఏవి అంటే..
ఈ సూర్యగ్రహణం వల్ల శుభయోగం కలిగే రాశుల్లో మిథున రాశి కూడా ఉంది. ఈ రాశి వారికి ఉన్నట్లుండి అధిక సంపాదన మీద ఆసక్తి కలుగుతుంది. వీరికి ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కలుగుతుంది. దీనికి తగ్గట్టుగానే వీరి సంపాదన కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్ద ఎత్తున మంచి ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశుల వారు ప్రయత్నిస్తే.. చిన్న చిన్న ప్రయత్నాలతో భారీగా సంపాదన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్‌కి, అధికారానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, వడ్డీ వ్యాపారం ఆర్థిక లావాదేవీలు, షేర్లు, బంగారం వంటివి వ్యక్తిగత సంపదను బాగా పెంచే సూచనలు ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
కర్కాటక రాశి పదవ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు దూరప్రాంతాలలో ఉన్న కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో భారీగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పని చేసే చోట.. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, కొనాలనుకుంటున్న వారికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవచ్చు. ఆరోగ్యంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇక విద్యార్థులు చదువుల్లో ఊహించని విధంగా విజయాలు వరిస్తాయి. దూర ప్రయాణాలకు, విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
ధను రాశి ఐదవ స్థానంలో సంభవిస్తున్న సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారి ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారి ఇచ్చే సలహాలు సూచనలు అందరికీ నచ్చడమే కాక మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ రాశి వారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఎన్నో సత్ఫలితాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో సలహాదారులుగా, ప్రణాళికకర్తలుగా, ప్లానర్లుగా ఉన్నవారు మంచి గుర్తింపుతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఈ రాశి వారు చేయాలనుకున్న ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్త వినడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వినే అవకాశం ఉంది.
కుంభ రాశి మూడవ స్థానంలో సూర్య గ్రహణం ఏర్పడటం వల్ల వృత్తి ఉద్యోగాలపరంగా ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఏ పని తలపెట్టినా సరే.. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేస్తే అంత కలసి వస్తుంది అంటున్నారు. విక్రమ స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల ఈ రాశుల వారికి చొరవ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది అంటున్నారు. ఈ రాశుల వారు ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒకే సారి అనేక కంపెనీల నుంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశుల వారు ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. ఏలినాటి శని ప్రభావం చాలావరకు తగ్గుతుంది అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.