Selfie Video: కొంతమంది యువతీ, యువకులు చదువులు మాత్రమే జీవితం అనుకుంటున్నారు. ఫేయిల్ అయినా.. సరిగా మార్కులు తెచ్చుకోలేకపోయినా.. ఆఖరికి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించకపోయినా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు నీట్ పరీక్షల చదువు తనకు ఒంట బట్టడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణం ఏంటో స్పష్టం చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో బుధవారం పొద్దున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై, చూలైమోడు ప్రాంతానికి చెందిన దనుష్ కొద్దిరోజుల క్రితం నీట్ పరీక్షల కోసం ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్‌లో చేరాడు.
అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సోల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో తన చావుకు కారణం ఏంటన్నది తెలియజెప్పాడు. ఆ వీడియోలో దనుష్ మాట్లాడుతూ.. ‘‘ నా చావుకు ఎవరూ కారణం కాదు! నా చావుకు నేనే కారణం. ఇంకెవరూ బాధపడటానికి లేదు. నా చావుకు వేరే వ్యక్తి కారణం అని ప్రజలు భావించటం నాకు ఇష్టం లేదు. నా శక్తి ఏంటో తెలుసుకోకుండా ఇన్నాళ్లు బతికాను. నేను పోయాక మా అమ్మను ఇబ్బంది పెట్టొద్దు. నా భవిష్యత్తు ఎలా నిర్ణయించుకోవాలో తెలియటం లేదు.
నేను చెత్తలాగా తయారయ్యాను. నా బుర్ర పనిచేయటం లేదు.. ఒత్తిడిలో ఉన్నాను. నేను వెళుతున్నా’’ అని పేర్కొన్నాడు. ఆత్మహత్య చేసుకున్న సాయంత్రం, పిల్లలతో ఆడుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో వారంతా బయటకు వెళ్లి నపుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిగా చదివి డాక్టర్ కావాల్సిన కుమారుడు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవటంపై దనుష్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దనుష్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kerala: బ్రష్ చేయకుండా ముద్దు పెట్టుకోవద్దన్న భార్య.. భర్త ఏం చేశాడో తెలుసా?