ప్రేమ కోసం ఎంతవరకైనా వెళ్తారు. ప్రేమను సాధించుకోవడానికి ఏదైనా చేస్తారు. అదే ప్రేమ దక్కదు అని తెలిస్తే అందరూ గుండె నిబ్బరం చేసుకుని ఉండలేరు. కొందరు దానిని అధిగమించి ముందుకెళ్తారు. మరికొందరు తప్పుడు నిర్ణయాలతో జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదనే విషయాన్ని తెలుసుకోలేక పోతున్నారు. ఏ సమస్య ఎదురైనా చావే దారి అనుకుంటున్నారు కొందరు. పోలీసులు, న్యాయ వ్యవస్థలను ఆశ్రయించకుండానే ఓటమిని ఒప్పుకుని తనువు చాలిస్తున్నారు. అలాంటి షాకింగ్ ఘటనే హర్యానాలోనూ జరిగింది. అతని ప్రేమకు అనుకోని సమస్య ఎదురైంది దానిని ఎదిరించకుండా ఆ యువకుడు రెండు పేజీల లెటర్ రాసి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
అసలు విషయం ఏంటంటే.. హర్యానా జిల్లాలోని బద్దోపట్టి గ్రామానికి చెందిన సత్యప్రకాష్(24) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. 16 నెలలపాటు వారి ప్రేమ సజావుగా సాగింది. పెళ్లి చేసుకుని సంతోషంగా గడపాలని కలలు కన్నారు. అలాంటి సమయంలో వారి జీవితంలో అనుకోని ఘటన జరిగింది. ఆ ప్రేమ జంట గురించి తెలుసుకున్న సునీల్ అనే ప్రభుత్వ ఉద్యోగి వారిని వేధించడం ప్రారంభించాడు. బలవంతంగా యువతిని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం కూడా చేసినట్లు సత్యప్రకాష్ ఆరోపించాడు. సునీల్‌కు వివాహమైంది, ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అతంటితో ఆగకుండా సత్యప్రకాష్‌ను కూడా బెదిరించడం ప్రారంభించాడు సునీల్. తనను చంపేస్తానని బెదిరించినట్లు చెప్పుకొచ్చాడు సత్యప్రకాష్. మొత్తం వారి జీవితంలో జరుగుతున్న సంఘటనల గురించి రెండు పేజీల లేఖ రాశాడు.
‘నేను బతకాలి అనుకోవట్లేదు. నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సంతోషంగా ఉన్న మా జీవితంలోకి సునీల్ ప్రవేశించాడు. నా ప్రేయసిని అత్యాచారం చేశాడు. నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆమె కుటుంబసభ్యులకు కూడా అతని నుంచి ముప్పు ఉంది. భయంతో సునీల్ మాటలకు నా ప్రేయసి అంగీకరించింది. ఆమె మానసిక క్షోభ అనుభవిస్తోంది. సునీల్ ప్రవర్తనకు సంబంధించిన అన్ని ఆధారాలు నా వాట్సాప్ ఉన్నాయి. వాడి వల్ల మేము సరిగా తిండి కూడా తినలేదు. సునీల్ చేసే పనులు అన్నీ ఆమె నాకు చెప్పింది. నా చావుకు కారణమైన సునీల్ కఠినంగా శిక్షించాలి. మరే జంట వాడి వల్ల బలి కాకూడదు. నేను చనిపోతే నా ప్రియురాలు జీవచ్ఛవంగా మారుతుందని నాకు తెలుసు. కానీ, నాకు ఇంక ఏ దారి లేదు. సునీల్ వీలైనంత త్వరగా శిక్షించండి. ఎంతో భవిష్యత్తు ఉన్న నేను.. సునీల్ కారణంగా మధ్యలోనే ప్రాణాలు తీసుకోవాల్సి వస్తోంది. మా కలల్ని చిన్నాభిన్నం చేసి.. నా చావుకు కారణం అయ్యాడు సునీల్’ అంటూ సత్యప్రకాష్ తన బాధను లెటర్లో చెప్పుకుని తనువు చాలించాడు.
ఏ సమస్యకి అయినా చావే పరిష్కారం అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.