కిరాణ షాపు నడిపిస్తున్న మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్నేశాడు. రోజూ ఆమె షాపుకు వెళ్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటున అతడు ఫొటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఓ దుర్మార్గుడు బరితెగించి ప్రవర్తించాడు. నమ్మకంగా ఉంటున్న నటించి ఓ మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా గత ఏడాది కాలంగా వేధించినట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం ఏపీలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో ఉన్న విశాలాంధ్ర కాలనీలో పుట్టా సుభాష్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి అదే గ్రామానికి చెందిన కిరాణ షాపును నడిపిస్తున్న మహిళపై కన్నేశాడు. రోజూ ఆమె షాపుకు వెళ్తూ వస్తుండేవాడు. ఈ క్రమంలోనే సుభాష్ ఆ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఇక ఆ మహిళ షాపులో సరుకులు కొనుగోలు చేసినప్పుడు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించేవాడు.
అలా మనీ సెండ్ చేసే క్రమంలోనే ఆమె ఫోన్ నెంబర్ ను తీసుకున్నాడు. దీనిని ఆసరాగా చేసుకున్న సుభాష్.. తరుచు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. ఇదిలా ఉంటే గత ఏడాది కిందట సుభాష్ ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో ఆమె స్నానం చేస్తుండగా సుభాష్ దొంగచాటును సెల్ ఫోన్ లో ఫొటోలు తీసుకున్నాడు. ఇక అదే వీడియోలను ఆమెకు చూపించాడు. వాటిని చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ గురైంది. ఆ ఫొటోలుతో సుభాష్ సుభాష్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ మహిళపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేకాకుండా నాకు డబ్బులు ఇవ్వాలని, లేకుండా నీ ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులకు గురి చేసేవాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ.. అనేక దఫాలుగా సుభాష్ కు ఏకంగా రూ.16 లక్షల వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. ఇక తిరిగి ఇవ్వాలని ఆ మహిళ ఎన్నోసార్లు వేడుకున్నా.. ఆమెపై దాడి చేయడమే కాకుండా అత్యాచారం చేశాడు. సుభాష్ ఇలా ఏడాది కాలంగా ఆ మహిళను అన్ని రకాలు హింసిస్తూ నరకం చూపించాడు. ఇన్నాళ్లు భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేకపోయింది. సుభాష్ దారుణంపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.