పైన కనిపిస్తున్న ఇద్దరూ ప్రేమికులు. ఉత్తర్ ప్రదేశ్ లోని శివ నాడార్ యూనివర్సిటీలో చదువుకుంటూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రియురాలు మరో యువకుడికి దగ్గరైందని తెలిసి ప్రియుడు తట్టుకోలేపోయాడు. ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే?
ప్రేమ మనిషిని ఎంతకైన తెగించేలా చేస్తుంది. కొందరు పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుంటే.. మరి కొందరు టైమ్ పాస్ ప్రేమాయణం సాగిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది నచ్చని ఆ ప్రేమికులు చివరికి ఆత్మహత్య చేసుకోవడం లేదంటే వారి ప్రాణాలను తీయడం చేస్తుంటారు. సరిగ్గా ఇలాగే ఆలోచించాడు ఓ ప్రేమికుడు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి మరొకరితో తిరుగుతుందనే కారణంతో దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని శివ నాడార్ యూనివర్సిటీలో అనూజ్ కుమార్ (23), స్నేహి అనే యువతి యువకులు సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరిదీ ఒకే క్యాంపస్ కావడంతో కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే ఇద్దరూ తరుచు మాట్లాడుకునేవారు. కొన్నాళ్ల తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అలా కొంత కాలం పాటు ఇద్దరూ ప్రేమ విహారంలో తేలియాడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి స్నేహ అతడిని ప్రేమిస్తూనే మరో యువకుడితో డేటింగ్ లో ఉన్నట్లు అనూజ్ కుమార్ తెలుసుకున్నాడు. ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్లు సమాచారం.
పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తే ప్రియురాలు మోసం చేసిందని అనూజ్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక ఎలాగైన ప్రియురాలు స్నేహను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల అనూజ్ కుమార్ క్యాంపస్ లో ప్రియురాలిని కౌగిలించుకుంటున్నట్లుగా నటించాడు. ఇదే సమయంలో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో స్నేహను కాల్చి హత్య చేశాడు. అనంతరం అనూజ్ కుమార్ సైతం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియురాలి తనను కాదని మరో యువకుడితో డేటింగ్ చేస్తుందని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) May 19, 2023